Was tortured in jail, will apprise PM Modi of my experience says Raut
Sanjay Raut: జైలులో ఉండగా తనను హింసించారని, తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి జైలులో తనకు ఎదురైన అనుభవాల గురించి, తనపై తీసుకున్న చర్యల గురించి విరిస్తానని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. బుధవారం జైలు నుంచి విడుదలైన ఆయన.. గురువారమే మోదీని, అమిత్ షాలను కలిసే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే శుక్రవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైలులో తనను హింసించారంటూ ఆరోపణలు చేశారు. ‘‘జైలులో ఉండగా నేను తీవ్ర హింసకు గురయ్యాను. తొందర్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లను కలుస్తాను. జైలులో నాపై జరిగిన హింసను నా అనుభవాల్ని వారికి తెలియజేస్తాను’’ అని అన్నారు.
ఇక గురువారం ఆయన భారతీయ జనతా పార్టీపై సానుకూలంగా స్పందించారు. వాస్తవానికి ఆయన మోదీ, షాలను కలుస్తానని చెప్పడమే ఒక ఆశ్చర్యమైతే.. దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించడం మరొక ఆశ్చర్యం. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మహారాష్ట్రలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫడ్నవీస్ నేతృత్వంలో రాష్ట్రం బాగానే నడుస్తోందని మేము అనుకుంటున్నాము’’ అని అన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే శివసేన మళ్లీ బీజేపీతో చేతులు కలపబోతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Aaditya Thackeray: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆదిత్య థాకరే.. రాహుల్‌కు ఆత్మీయ ఆలింగనం