Bharat Jodo Yatra
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ లో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఇందులో భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఆయన కొద్ది సేపు పాదయాత్ర చేశారు. ఇవాళ ఉదయం రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్, భడోతీ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.
రాహుల్ గాంధీ పాదయాత్రకు రాజస్థాన్ లో ప్రజల నుంచి భారీగా మద్దతు వస్తోంది. రాహుల్ తో పాటు కాంగ్రెస్ నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాదయాత్రలో పాల్గొంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. సెప్టెంబరు 7 నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నికలతో సంబంధం లేకుండా, దేశ ప్రజలకు ఏకం చేయడానికే ఈ యాత్ర చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఆ యాత్ర 12 రాష్ట్రాల్లో 3,570 కిలో మీటర్లు జరుగుతుంది. పాదయాత్ర మొత్తం తెల్ల షర్టు ధరించి రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు. రాత్రి సమయంలో ఆయన కంటైనర్లలో బస చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన పాదయాత్ర తమిళనాడు, కర్ణాటక, ఏపీ, కేరళ, తెలంగాణ, మహారాష్ట్రలో ముగిసింది.
Bangladesh vs India: తొలి టెస్టు మ్యాచు షురూ.. బ్యాటింగ్ ఎంచుకున్న కేఎల్ రాహుల్