Bangladesh vs India: తొలి టెస్టు మ్యాచు షురూ.. బ్యాటింగ్ ఎంచుకున్న కేఎల్ రాహుల్

Bangladesh vs India: తొలి టెస్టు మ్యాచు షురూ.. బ్యాటింగ్ ఎంచుకున్న కేఎల్ రాహుల్

Bangladesh vs India

Updated On : December 14, 2022 / 9:07 AM IST

Bangladesh vs India: బంగ్లాదేశ్-భారత్ మధ్య చటోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో మొదటి టెస్టు మ్యాచు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా క్రీజులోకి ఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ వచ్చారు.

టీమిండియాలో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, సిరాజ్ ఉన్నారు.

మొదటి మ్యాచులో ఆడకుండా రోహిత్ శర్మకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో రోహిత్ శర్మ ఎడమచేతి బొటనవేలుకు గాయమైన నేపథ్యంలో అతడు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. అతడు రెండో టెస్టు మ్యాచులో ఆడే విషయంపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొదటి టెస్టు కోసం జట్టులోకి అభిమన్యు ఈశ్వరన్ ను టీమిండియా స్క్వాడ్ లో చేర్చినప్పటికీ అతడిని ఇవాళ తీసుకోలేదు.

అలాగే, గాయాల కారణంగా మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాను టెస్టు సిరీస్ నుంచి పూర్తిగా తప్పించారు. నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ టీమిండియా స్క్వాడ్ లో ఉన్నప్పటికీ వారికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇటీవలే వన్డే సిరీస్ ను టీమిండియా కోల్పోయింది. రెండు మ్యాచుల సిరీస్ లోనయినా గెలవాలని కసిగా ఉంది. ఇప్పటివరకు టెస్టు మ్యాచుల్లో టీమిండియాపై బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా గెలవలేదు.

FIFA World Cup 2022: సెమీఫైనల్లో క్రొయేషియా చిత్తు.. ఫైనల్లోకి దూసుకెళ్లిన మెస్సీ జట్టు