Restaurant for Elephants : ఏనుగుల కోసం ప్రత్యేక రెస్టారెంట్ .. క్యూ కట్టిన గజరాజులు

ఏనుగుల కోసం ప్రత్యేక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్ కు బ్రేక్ ఫాస్ట్ చేయటానికి గజరాజులు క్యూ కట్టాయి.

breakfast is prepared for elephants : ఏనుగుల కోసం ఓ ప్రత్యేక రెస్టారెంట్ ను ఏర్పాటుచేశాకు కొంతమంది. దీంతో గజరాజులు ఆ రెస్టారెంట్ కు క్యూకట్టాయి. తమకోసం ఓ రెస్టారెంట్ ఉందని వాటికి ఎలా తెలిసింది లైను కట్టి వచ్చేయటానికి అని అనుకుంటున్నారా?అంటే ఏనుగుల యజమానులు తమ గజరాజులను తీసుకొచ్చారన్నమాట. ఇంతకీ ఏనుగుల కోసం రెస్టారెంట్ ఏంటీ..?అది ఎక్కడుంది? అనే విషయానికొస్తే..

తమిళనాడులో సురేందర్ మెహ్రా అనే భారతీయ అటవీ అధికారి మదుమలైలోని ఈ తెప్పకడు ఏనుగుల కోసం ఓ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్ లో ఏది పడితే ఆ ఆహారాన్ని తయారు చేయరు. ఎందుకంటే ఏనుగులు ఆహారం తిన్నాక అస్వస్థతకు గురి కాకూడదనే ఉద్ధేశంతో సురేందర్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీంట్లో భాగంగా ఏనుగుల కోసం తయారుచేసే ఆహారం పశువైద్యడి పర్యవేక్షణలో జరిగే ఏర్పాటు చేశారు.

ఏనుగులు పూర్తి శాఖాహారులు. అందుకే జొన్న, బియ్యం, ఉప్పు, బెల్లంతో ఆహారాన్ని తయారు చేస్తారు. ఆహారాన్ని పెద్ద ముద్దలు తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ ఏనుగుల రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.IAS అధికారి సుప్రియా సాహు షేర్ చేసిన ఈ వీడియోను లక్షల మంది చూశారు. ఈ వీడియోలో ఏనుగుల కోసం తయారు చేసే ఆహారాన్ని ఎంత జాగ్రత్తగా..శ్రద్ధగా చేస్తున్నారో ఉంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆహా గజరాజుల రెస్టారెంట్ లో ఫుడ్ భలే గజరాజులకు తగినట్లుగానే ఉందే అంటున్నారు. ఓ యూజర్ అయితే అంతాబాగానే ఉంది కానీ ఏనుగులకు ఆ గొలుసు ఎందుకు అని అడుగుతున్నారు. జంతువుల కోసం కేటాయించిన స్థలంలో ఇక్కడ కూడా వాటికి గొలుసులు అవసరమా? అని ప్రశ్నిస్తున్నాడు. చక్కగా వాటికి సరిపడా ఆహారాన్ని స్వేచ్ఛగా తిరుగుతూ ఆహారాన్ని ఆస్వాదించేలా ఉంటే బాగుంటుందంటు సూచించారు.

 

ట్రెండింగ్ వార్తలు