EAM: 80 కోట్ల మందికి ప్రభుత్వం నుంచి ఆహారం అందుతోంది: కేంద్ర మంత్రి ఎస్.జయశంకర్

అనేక మంది జీవితాన్ని అర చేతిలో పట్టుకుని నడుచుకుంటూ బయల్దేరారు. ఇలా వెళ్తూ దారి మధ్యలోనే కన్నుమూశారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇలా ఎంతో మంది ఆ సమయంలో మృతి చెందారు. ఇదే సమయంలో ఆకలి చావులు కూడా అనేకం చోటు చేసుకున్నాయనే వాదనలు బలంగానే ఉన్నాయి. అయితే ఈ విషయమై ప్రభుత్వాన్ని పార్లమెంటులో ప్రశ్నించగా.. తమ వద్ద ఆ డేటా లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం.

EAM: లాక్‭డౌన్ సమయం నాటి నుంచి దేశంలోని సుమారు 80 కోట్ల మంది ప్రభుత్వం నుంచి ఆహారం అందుతోందని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్ అన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన.. శనివారం రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‭లోని ఐఐఎంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు గురించి వివరించారు.

‘‘ఈరోజు మనం 7-8 శాతం ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నాము. ప్రపంచం మొత్తం మన ఆర్థిక వ్యవస్థను ఎంతో గౌరవంగా చూస్తోంది. లాక్‭డౌన్ సమయం నుంచి నేటి వరకు దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వం నుంచి ఆహారం అందుతోంది. కాబట్టి రోగాల భారిన పడిన వారికంటే ఆకలి చావులు ఎక్కువనే విమర్శలు అర్థం లేనివి’’ అని జయశంకర్ అన్నారు.

వాస్తవానికి కొవిడ్-19 లాక్‭డౌన్ సమయంలో.. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. దీనికి తోడు సొంత ఊరికి వెళ్లేందుకు అనుమతి లేదు. ఉన్న ఊరిలో ఉపాధి లేక కన్న ఊరికి వెళ్లలేక అవస్తలు పడ్డారు. అనేక మంది జీవితాన్ని అర చేతిలో పట్టుకుని నడుచుకుంటూ బయల్దేరారు. ఇలా వెళ్తూ దారి మధ్యలోనే కన్నుమూశారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇలా ఎంతో మంది ఆ సమయంలో మృతి చెందారు. ఇదే సమయంలో ఆకలి చావులు కూడా అనేకం చోటు చేసుకున్నాయనే వాదనలు బలంగానే ఉన్నాయి. అయితే ఈ విషయమై ప్రభుత్వాన్ని పార్లమెంటులో ప్రశ్నించగా.. తమ వద్ద ఆ డేటా లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం.

Deoghar airport row: జార్ఖండ్ ఐఏఎస్ అధికారిపై దేశద్రోహం కేసు ఫైల్ చేసిన బీజేపీ ఎంపీ

ట్రెండింగ్ వార్తలు