Photo Shoot : పెళ్లి వేదికపైకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండగా కిందపడ్డ వధూవరులు.. వైరల్ వీడియో
పెళ్లిలో ప్రత్యేకంగా నిలవాలనుకున్న కొత్తజంట ఊహించని పరిణామంతో కంగుతింది. జేసీబీ బకెట్ ఒక్కసారిగా కిందకు రావడంతో వధూవరులు డైనింగ్ టేబుల్‌పై పడిపోయారు
- kunduru Vinod
- Updated on- November 16, 2021 / 08:26 AM IST
Photo Shoot
Photo Shoot : ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అబ్బాయికైనా, అమ్మాయికైనా పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజును స్పెషల్‌గా మార్చుకోడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. పెళ్లికి వచ్చిన అతిధులు భోజనం చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు జేసీబీ బకెట్‌లోకి ఎక్కి కూర్చుకున్నారు.
చదవండి : Wedding Cake Payment : పెళ్లిలో తిన్న కేకుముక్కకు డబ్బులు కట్టమని అతిథిని డిమాండ్ చేసిన కొత్తజంట..
ఫోటోలు దిగుతున్న సమయంలో హైడ్రాలిక్ సిస్టంలో సమస్య రావడంతో బకెట్ ఒక్కసారిగా కిందకు వంగింది దీంతో ఇద్దరు డైనింగ్ టేబుల్ పై పడిపోయారు. 10 అడుగుల ఎత్తునుంచి కిందపడటంతో చుట్టుపక్కల వరకు ఆందోళన చెందారు. ప్రత్యేకంగా ఉండేందుకు జేసీబీ ఎక్కిన కొత్త జంట ఊహించని ప్రమాదంతో కంగుతింది.
చదవండి : Wedding pics deleted : భోజనం చేయనివ్వలేదని..! పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన ఫొటోగ్రాఫర్
ఇక అక్కడ భోజనం చేసే అతిధులు తమ ప్లేట్లు పక్కనపెట్టి వచ్చి వధూవరులను పైకి లేకపారు. కాగా అక్కడ ఉన్నవారు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో బందించి సోషల్ మీడియాలో పోస్టుచేయడంతో ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సాధించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
