Weddings Starts : పెళ్లిళ్లకు శుభముహూర్తాలు షురూ..ఇక భజంత్రీల మోతే

శ్రావణమాసం రాకతో శుభముహూర్తాలకు వేళ కావటం భాజా భజంత్రీలు మోగనున్నాయి. పెళ్లిళ్ల ఇళ్లలో సందడి సందడిగా మారాయి. పెళ్లిళ్లు భారీ సంఖ్యలో ఉండడంతో అన్ని రంగాల వారికి చేతినిండా పని దొరికినట్లైంది.

Weddings Starts : పెళ్లిళ్లకు శుభముహూర్తాలు షురూ..ఇక భజంత్రీల మోతే

Weddings Starts

Wedding Ceremonys starts : మంగళకరం..శుభకరం అయిన శ్రావణమాసం వచ్చేసింది. పెళ్లి వచ్చేసిందే బాలా అంటోంది.ఇక భాజాభజంత్రీల మోత షురూ కానుంది.శ్రావణ మాసంలో పెళ్లిళ్లతో పాటు పలు రకాల శుభకార్యాలకు రెడీ అయిపోయారు ప్రజలు. కరోనా వల్ల వాయిదా వేసుకున్న శుభకార్యాలన్ని షురూ కానున్నాయి. దీంతో పురోహితులు..భాజా భంజత్రీల వారికి, ఫోటో గ్రాఫర్లకు, కేటరింగ్ లకు, ఫంక్షన్ హాల్స్ అన్ని బిజీ అయిపోతున్నాయి. కరోనా మహమ్మారి వల్ల గత ఐదు నెలలుగా వివాహాది శుభకార్యాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం..అలాగే ముహూర్తాల మాసం శ్రావణమాసం రావటంతో శుభకార్యాలు ఊపందుకున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో కల్యాణ మండపాలు కళ కళ లాడనున్నాయి.

కాగా కార్తీక మాసం పరమశివుడికి ఇష్టమైనదైతే..శ్రావణమాసం మాత్రం శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైనది. ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో వివాహాలు భారీ సంఖ్యలో జరుగుతాయి. ఆగస్టు 9 నుంచి శ్రావణం ప్రారంభమైంది. ఇక ఇన్నాళ్లు ముహూర్తాలు లేక ఎదురుచూసినవారంతా శుభకార్యాలు చేసుకోవటానికి రెడీ అయిపోయారు. దీని కోసం ముందుగానే ప్లాన్స్ వేసేసుకోవటంతో ఇక భాజాలు మోగటమే తరువాయి అన్నట్లుగా ఉన్నారు. శుభముహూర్తాలు ఉండడంతో పెళ్లి భాజాలు మోగనున్నాయి.

చేతినిండా పనే పని..
ఈ శ్రావణంలో పెళ్లిళ్లు భారీ సంఖ్యలో ఉండడంతో అన్ని రంగాల వారికి చేతినిండా పని దొరికినట్లైంది. పురోహితులు, ఫ్లవర్‌ డెకరేషన్, భజంత్రీలు, క్యాటరింగ్, ఫొటో, వీడియోగ్రాఫర్స్, ఫంక్షన్ హాల్స్, టైలర్స్ లకు డిమాండ్‌ ఏర్పడింది. వివాహా వేదికల కోసం కల్యాణ మండపాలు, కన్వెన్షన్‌ హాల్స్, సత్రాలు, హోటల్స్ ముందుగానే బుక్ అయిపోయాయి అడ్వాన్స్ లతో. ఇక మార్కెట్‌లో బట్టల షాపులు, బంగారం, సరుకుల కొనుగోళ్ల సందడి నెలకొంది.

శుభ ముహూర్త తేదీలు..
ఈనెలలో 12, 13, 14, 16, 18, 20, 21, 22, 25, 26, 27 సెప్టెంబర్‌ 1 వరకూ ముహుర్తాలే ముహూర్తాలు. వీటిల్లో ఆగస్టు 14 స్వాతీ, 16న అనురాధ, 18న ఏకాదశి, మూల 21న శ్రవణా, 25న ఉత్తరాభద్ర 26న రేవతి నక్షత్రాలు కలిసిన ముహుర్తాలు ఉండటంతో ఆయా తేదీల్లో ఎక్కువ వివాహాలు భారీ సంఖ్యలో జరుగుతాయని పండితులు చెబుతున్నారు.

సెప్టెంబర్‌ 2నుంచి అక్టోబర్‌ 5వరకు శుభముహూర్తాలు లేవు. మళ్లీ అక్టోబర్‌ 7, 8,10 15, 16, 17, 20, 21, 23, 24, 31న ముహూర్తాలు ఉన్నాయి. నవంబర్‌ (కార్తీక మాసం)లో 6, 10, 12, 13, 17, 20, 21 తేదీలు, డిసెంబర్‌ (మార్గశిరమాసం)లో 5, 8, 9, 10, 12, 17, 18, 19, 24 తేదీల్లో ముహూర్తాలు వివాహాలు జరిగే అవకాశాలున్నాయని పండితులు చెబుతున్నారు.