Police Lathi Charge : నిరుద్యోగులపై లాఠీ జులిపించిన పోలీసులు

నిరుద్యోగులపై పోలీసులు లాఠీ జులిపించారు. ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన నిరుద్యోగులను చితకబాదారు. ఈ ఘటన ముర్షిదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Police Lathi Charge : నిరుద్యోగులపై పోలీసులు లాఠీ జులిపించారు. ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన నిరుద్యోగులను చితకబాదారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రాష్ట్రంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ముర్షిదాబాద్‌లోని బెర్హంపూర్ స్టేడియానికి నిరుద్యోగులు పోటెత్తారు.

చదవండి : West Bengal‌ : కదులుతున్న రైల్లో నుంచి దూకిన ఇద్దరు మహిళలు.. ప‌రుగెత్తుకెళ్లి ప్రాణాలు కాపాడిన రైల్వే ఎస్సై

అభ్యర్థులతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. ఇదే సమయంలో అభ్యర్థుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరు క్యూ లైన్ లోంచి బయటకు రావడంతో పోలీసులు వారిపై లాఠీ జులిపించారు. ఈ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీడియోలు వైరల్‌గా మారాయి.

చదవండి : West Bengal Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

ఇక సేమ్ ఇలాంటి తరహా ఘటనే పంజాబ్ లో జరిగింది. బటిండాలో రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌ను ఘెరావ్ చేయడానికి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ప్రయత్నించారు. దీంతో పంజాబ్ పోలీసులు ఆ కాంట్రాక్టు ఉద్యోగుల కాళ్లు, చేతులు పట్టుకుని అక్కడి నుంచి లాక్కొనిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు