బెంగాల్లో బీజేపీ నేత జేపీ నడ్డా కారుపై రాళ్ల దాడి

  • Published By: nagamani ,Published On : December 10, 2020 / 02:29 PM IST
బెంగాల్లో బీజేపీ నేత జేపీ నడ్డా కారుపై రాళ్ల దాడి

Updated On : December 10, 2020 / 3:20 PM IST

west bengal stone pelting against jp nadda convoy : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య వైరం తెలిసిందే. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే అనేక పర్యాయాలు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలు కూఆ నమోదయ్యాయి.


పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగింది. నడ్డా 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్ ప్రాంతానికి వెళుతుండగా ఓ గుంపు ఆయన కాన్వాయ్ పై రాళ్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి.

కొందరు వ్యక్తులు పెద్ద ఇటుకల సైజులో ఉన్న రాళ్లను వాహనాలపైకి విసిరారు. ఈ మేరకు ఓ వీడియోలో వెల్లడైంది. ఈ దాడిపై పశ్చిమ బెంగాల్ బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. జేపీ నడ్డా రెండ్రోజుల పర్యటన కోసం పశ్చిమ బెంగాల్ రాగా..ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని లేఖలో పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆరోపించారు. నిన్న జేపీ నడ్డా పాల్గొన్న కార్యాక్రమాల వద్ద పోలీసులే కనిపించలేదని ఆరోపించారు.


ఈ ఘటనపై బీజేపీ నేత కైలాష్ విజయవర్గియా మాట్లాడుతూ..ఆ దాడిలో నేను గాయపడ్డానని పార్టీ అధ్యక్షుడిపై కూడా దాడి జరిగిందని తెలిపారు. పోలీసులు సమక్షంలోనే ఈ గూండాలు మాపై దాడిచేస్తుంటే పోలీసులు ఏమాత్రం స్పందించనలేదని ఆరోపించారు. మాపై తృణముల్ కాంగ్రెస్ గూండాలే మాపై దాడికి పాల్పడ్డారని అసలు మేం భారతదేశంలోనే ఉన్నామనిపిస్తోందని ఈ దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు.


కాగా..పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య వైరం తెలిసిందే. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే పలు అంశాలపై పలుమార్లు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలు జరిగిన విషయం తెలిసిందే.