what are the key demands of farmers what do they want
Farmers Protest: అన్నదాతలు మరోసారి కదం తొక్కారు. తమ డిమాండ్ల సాధనకు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మరోసారి సమరశంఖం పూరించారు. చల్లో ఢిల్లీ పేరుతో మంగళవారం హస్తినలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో వేలాదిగా రైతులు ఢిల్లీకి తరలివచ్చారు. అన్నదాతల ఆందోళనతో ఢిల్లీ స్తంభించింది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. అన్నదాతల ఆందోళన నేపథ్యంలో వారి డిమాండ్లు ఏంటనే దాని గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు.
రైతుల డిమాండ్లుఇవే..
ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తూ చట్టం చేయాలి
రైతులకు సాగు రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి
2013 భూసేకరణ చట్టం అమలు.. నాలుగు రెట్ల పరిహారం చెల్లించాలి
లఖిమ్ పూరి ఖేరి ఘటన బాధ్యలను శిక్షించాలి.. బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలి
WTOతో చేసుకున్న ఒప్పందాలపై నిషేధం విధించాలి
రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలి
ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలి
విద్యుత్ సవరణ బిల్లు 2020ను ఉపసంహరించుకోవాలి
వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి.. 200 రోజులకు పని దినాలను పెంచాలి, రోజువారీ కూలి రూ. 700 ఇవ్వాలి
నకిలీ విత్తనాలు, పురుగు మందుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మిర్చి, పసుపు సుగంధ పంటలకు సంబంధించి జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి
ఆదివాసుల హక్కులను, అటవీ భూములను రక్షించాలి
Also Read: కేంద్ర మంత్రులతో చర్చలు విఫలం.. 2500 ట్రాక్టర్లతో ఢిల్లీకి రైతులు.. సరిహద్దుల్లో హైఅలర్ట్
కేంద్రం ప్రతిపాదనకు నో చెప్పిన ఢిల్లీ సర్కారు
ఢిల్లీ ఛలో రైతుల ఆందోళన దృష్ట్యా బవానా స్టేడియాన్ని జైలుగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. రైతుల డిమాండ్లు హేతుబద్దమైనవి, వారిని అరెస్ట్ చేయడం సరికాదని ఢిల్లీ హోం మంత్రి కైలాష్ గెహ్లాట్ అన్నారు. శాంతియుతంగా నిరసనలు చేయడం ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని గుర్తు చేశారు.