వారం రోజుల క్రితమే.. కేరళలో కరోనా బీభత్సం మొదలైంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న కొచ్చి నగరంలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కరోనా పేషెంట్లను గుర్తించడమొక పని. వారికి సరైన పద్ధతిలో ట్రీట్‌మెంట్ ఇవ్వడం మరొక ఘనత. ఇందులో కేరళ లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను వాడింది. రెండు రోబోలు సిద్ధం చేసి.. మాస్క్‌లు, శానిటైజర్లు, నేప్‌కిన్స్ పంచిబెట్టింది.
వాటితో పాటు కొవిడ్-19గురించి ప్రచారం చేసింది. ఎసిమోవ్ రొబోటిక్స్ సీఈఓ ఈ రోబోలను సిద్ధం చేశారు. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ.. సేవలు అందించాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కేరళలో కొత్త కేసులు నమోదు కాకపోగా, ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.
కేరళలో తొలి కేసు నమోదైన రోజు నుంచి కరోనాపై యుద్ధం చేస్తూనే ఉంది. ఈ రోబోల సాయంతో 12వేల 740మంది నుంచి 18వేల 11మంది వరకూ అబ్జర్వేషన్ లో ఉంచారు. అందులో 17వేల 743మందిని ఇళ్లలో ఉండగా కేవలం 268మంది హాస్పిటళ్లలో ఉన్నారు. మూడు కేసులు ఇప్పటికే క్లియర్ అయిపోయ్యాయి.
జనవరి 17నుంచి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తున్నప్పటికీ.. జనవరి 30న కేరళలో తొలి కేసు నమోదైంది. ఫిబ్రవరి 3న మరో 2కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల్లో రాష్ట్రం ఎమర్జెన్సీ ప్రకటించింది. 2018లో నిఫా వైరస్ ఎదుర్కొన్న రాష్ట్రం కాబట్టి ఆరంభంలోనే స్మార్ట్‌గా ఎదుర్కొంది. వారు రెండు విధాలుగా రక్షించుకున్నామని అంటున్నారు.
Robots dispensing sanitiser & #COVID2019 advice. In Kerala!! pic.twitter.com/TlBETlxXel
— Shashi Tharoor (@ShashiTharoor) March 17, 2020
అవసరమైనప్పుడు సర్వేలెన్స్ వాడి:
ప్రైవసీ.. డేటా రక్షణ వంటి పద్ధతులను ఫాలో అయ్యే భారతదేశంలో డేటా మార్చుకోవడం తక్కువగానే భావిస్తారంతా. కానీ, కేరళ దానికి వ్యతిరేకంగా ప్రయత్నించింది. సంక్షోభంలోనూ కరోనా పాజిటివ్ కేసులకు రూట్ మ్యాప్‌లను విడుదల చేసింది. రిస్క్ జోన్లను ముందుగానే హెచ్చరించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చింది.
ఫిబ్రవరిలో ఇటలీ నుంచి ఓ కుటుంబం కేరళకు రావడంతో అసలు సమస్య మొదలైంది. వారందరితో కాంటాక్ట్‌లో ఉన్న దాదాపు 1000మందిని పిలిపించిన మెడికల్ టీం వారందరిని క్వారంటైన్‌లో ఉంచింది.
#CoronavirusPandemic #coronavirusinindia
THREAD ?
1/ #Kerala Duo Buys Masks For Rs 10, Sells 5000 of Them At Rs 2 Each to Help the Most Needy pic.twitter.com/zpot2DRQmQ— The Better India (@thebetterindia) March 14, 2020
ఎయిర్‌పోర్టు ప్రజల్లో భయం:
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందల్లో ప్రయాణికులు గంటల కొద్దీ బార్లు తీరి నిలబడుతూ ఉండిపోయారు. అటువంటి సమయంలో పాజిటివ్ కేసులు ఏమైనా ఉంటే ఇతరులకు సోకే అవకాశం ఉంది. కేరళలో ఇలాంటి సంఘటనలో ప్రత్యేక ఏర్పాటు చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన ఒక బ్రిటిష్ పేషెంట్ ఉన్న విమానాన్ని టేకాఫ్ చేయలేదు.
ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. 5వేల మందికి సరిపడ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్‌పై నమ్మకం లేక స్క్రీనింగ్‌లలో, ఐసోలేషన్ వార్డులలో ఏ ఇబ్బంది లేదని తెలిశాక వారిని విడిచిపెట్టింది.
How decentralised health edu works? See commuters washing their hands after getting down from a bus in #Kerala‘s Calicut. Bcoz of Kerala govt’s #BreakTheChain campaign, grassroot orgs have installed hand wash/sanitisers across public places like mofussil bus stops. #KeralaModel pic.twitter.com/VwrZsRjDpG
— Nidheesh M K (@mknid) March 18, 2020
జనాభాకు భయం లేకుండా:
కొవిడ్-19పై భయం లేకుండా.. ప్రత్యేకించి కొన్ని సార్లు స్క్రీనింగ్ చేసి మాత్రమే ఇళ్లకు పంపారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సౌకర్యాలపై ప్రశ్నిస్తున్నా పట్టించుకోలేదు. నిఫా వైరస్ పీడించిన రోజుల్లో జాగ్రత్తలను అమలు చేస్తూ గట్టెక్కేసింది. అంతేకాకుండా అప్పుడు ఎలా అయితే ప్రజలను సైకాలజికల్‌గా సిద్ధం చేసిందో.. అదే పద్ధతి వాడింది.
Breakfast provided at #Coronavirus isolation wards in #Kerala
A pic came from Kalamassery Govt hospital! Proud of you guys❤️ I was reading about the situation in Delhi and Maharashtra. Now this pic made my day! pic.twitter.com/pI936iWtMR— Nithin Mathew (@nithinmathew123) March 17, 2020
ప్రజలే సమాధానంగా:
దేశ వ్యాప్తంగా ప్రజలు ఒక్కో రకంగా స్పందిస్తుంటే కేరళవాసులు స్వచ్ఛందంగా కదలివచ్చారు. ఏ రకంగానూ ప్రజలను గుమిగూడనివ్వకుండా కేరళ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే సందర్భంగా పోలీసులే డ్యాన్స్ చేస్తూ.. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ చెప్తూ.. ఎంటర్‌టైన్ చేశారు. జైల్లో ఉన్న ఖైదీలను సైతం అలర్ట్ చేస్తూ.. 6వేల మాస్క్‌లను పంచిపెట్టింది.
See Also | కరోనావైరస్ లాక్‌డౌన్‌లోని ఓ తల్లి…పాపను ఆడుకోమని అంటే…ఏకంగా ఇంటికి, వంటికి పెయింట్ వేసింది…