Karnataka (3)
Karnataka Congress MLA : కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్‌కుమార్ అసెంబ్లీ సమావేశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. అత్యాచారం అనివార్యమైనప్పుడు…అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతోంది. అయితే శాసనసభ స్పీకర్ దీనిని ఖండించకుండా పగలబడి నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రమేశ్‌కుమార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ సొంత పార్టీ నేతలే కోరుతున్నారు.
Read More : Sumanth : చెక్ బౌన్స్ కేసులో మార్కాపురం కోర్టుకి హీరో సుమంత్, సుప్రియ
రమేశ్ కుమార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ జోక్స్ వేసి ఎన్నోసార్లు పరువు పొగొట్టుకున్నారాయన. 2019లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా వున్న రమేశ్ కుమార్ తనను తాను అత్యాచార బాధితుడితో పోల్చుకున్నారు. పార్టీ నుంచి 50 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారంటూ యడియూరప్ప, ఇతర సీనియర్ నేతలు ఆయనపై ఆరోపణలు గుప్పిస్తూ ఆడియో టేప్ వైరల్ అయ్యింది. ఈ ఆడియో క్లిప్‌లో తన పేరు వినిపించిన సమయంలో రమేశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read More : Omicron : భారత్‌లో ఒమిక్రాన్ టెర్రర్..కేసులు ఎన్నంటే
ఆ సమయంలోనే తన పరిస్ధితి అత్యాచార బాధితురాలిగా ఉందని రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై మహిళా శాసనసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రమేశ్ కుమార్ సభకు క్షమాపణలు చెప్పారు. 2020 సెప్టెంబర్‌లోనూ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరీని వెంటనే అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని చెబుతూ కూడా రమేశ్ కుమార్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.