×
Ad

బిహార్‌ ఎన్నికల్లో అత్యంత పిన్న వయసు ఎమ్మెల్యేగా ఎన్నికైన అమ్మాయి.. ఈమెకి కోట్లాది మంది ఫాలోవర్లు

మైథిలీ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

Maithili Thakur

Maithili Thakur: బిహార్‌ ఎన్నికల్లో అత్యంత పిన్న వయసు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు జానపద గాయని మైథిలీ ఠాకూర్. ఈమెకి సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. అలీనగర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ఆమె సునాయాసంగా గెలుపొందారు.

ఆర్జేడీ కీలక నేత వినోద్‌ మిశ్రాను ఆమె దాదాపు 11,000 ఓట్ల తేడాతో ఓడించారు. మైథిలీ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఆమె వయసు 25 మాత్రమే. జానపద పాటలతో ఆమె చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

మైథిలీ భాష, కవిత్వం, సాంస్కృతిక సంప్రదాయాలను ఎన్నో ఏళ్లుగా వివిధ వేదికలపై ఆమె ప్రచారం చేస్తున్నారు. గత ఏడాది శబరి మీద పాడిన ఆమె పాట పాడారు. ఆ పాటను ప్రధాని మోదీ విని ప్రశంసల జల్లు కురిపించారు. తనను తాను ఆమె “మిథిలా కుమార్తె”గా పలుసార్లు పేర్కొన్నారు.

బీజేపీ కొత్తతర అభ్యర్థులను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈమె కీలకం అవుతున్నారు. ఆమె గతంలో పాడిన ‘ఏ రాజా జీ’ పాట ఫేమస్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నితీశ్‌ కుమార్‌పై అదే పాట పాడారు. తమ నియోజకవర్గాన్ని సీతాపుట్‌గా పేరు మార్చుతానని ఆమె ముందే ప్రకటించారు.

మైథిలీ ఠాకూర్ వివరాలు

  • వయసు: 25
  • ఆస్తులు: రూ.3.8 కోట్లు
  • విద్య: గ్రాడ్యుయేట్
  • కేసులు: లేవు
  • యూఎస్‌పీ: సాంస్కృతిక ఐకాన్ + యువతలో క్రేజ్‌ + ఇన్‌ఫ్లూయన్సర్‌