యోగి సర్కార్ పై WHO ప్రశంసలు

WHO Praises UP Government ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ప్రశంసలు కురిపించింది. కరోనా కట్టడి విషయంలో యూపీ పనితీరు అద్భుతమని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలుపర్చిన COVID-19 నిర్వహణ వ్యూహం ఇతర రాష్ట్రాలు అనుసరించడానికి ఒక మంచి ఉదాహరణగా పేర్కొంది.



కాంటాక్ట్ ట్రేసింగ్(కరోనా పాజిటివ్ వచ్చినవాళ్లతో సన్నిహితంగా మెలిగినవాళ్లను గుర్తించడం) ప్రయత్నాలను వేగవంతం చేయడం ద్వారా కరోనా వైరస్ పట్ల యూపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా స్పందించడం ఆదర్శప్రాయమైనది మరియు ఇతర రాష్ట్రాలకు ఇది ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని WHO భారతదేశ ప్రతినిధి రోడెరికో అఫ్రిన్ ఒక ప్రకటనలో తెలిపారు.



కరోనా మహమ్మారిని నిలువరించడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది ఒక ముఖ్యమైన ప్రజా ఆరోగ్య సాధనంగా అఫ్రిన్ పేర్కొన్నారు. తనిఖీ కార్యక్రమాలను అమలుచేయడానికి బాగా తర్ఫీదు పొందిన ఆరోగ్య సిబ్బందితో పాటు సరైన నిర్వహణ వ్యవస్థ ద్వారా కాంటాక్టుల సిస్టమాటిక్ ట్రాకింగ్ చాలా ముఖ్యమైనదని తెలిపారు.



కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రయత్నాలకు మరింత ఊపునిచ్చేందుకు మరియు ట్రైనింగ్ ద్వారా క్షేత్రస్థాయి బృందాల సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి WHO టీమ్ సాంకేతిక సాయం అందించినట్లు ఉత్తరప్రదేశ్ రీజియన్ WHO-NPSP(నేషనల్ పోలీస్ సర్వైవ్ లెన్స్ ప్రాజెక్ట్)రీజినల్ టీమ్ లీడర్ మధుప్ భాజ్ పాయి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు