Cheetahs Releases In Kuno Park: కునో నేషనల్ పార్క్‌లోనే చీతాలను ఎందుకు ఉంచారు.. అక్కడ ఉండే ప్రత్యేకతలు ఏమిటి?

భారత్‌లోకి చీతాలు అడుగుపెట్టాయి. 74ఏళ్ల క్రితం దేశంలో ఇవి అంతరించిపోయాయి. దేశంలో చీతాల సంతతిని తిరిగి పెంచడం కోసం కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ జిల్లాలో ఉన్న కునో నేషనల్ పార్క్‌లో ఉంచారు.

Cheetahs Releases In Kuno Park: భారత్‌లోకి చీతాలు అడుగుపెట్టాయి. 74ఏళ్ల క్రితం దేశంలో ఇవి అంతరించిపోయాయి. దేశంలో చీతాల సంతతిని తిరిగి పెంచడం కోసం కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ జిల్లాలో ఉన్న కునో నేషనల్ పార్క్‌లో ఉంచారు. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ పార్కులో ఏర్పాటుచేసిన ప్రత్యేక క్వారెంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. ప్రస్తుతం భారత్ కు వచ్చిన చీతాల్లో ఐదు ఆడవి, మూడు మగ చీతాలు ఉన్నాయి. ఇవన్నీ నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయస్సు కలిగినవే. అయితే.. వీటిని కునో నేషనల్ పార్కులో ఉంచడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

Cheetahs Back In India: చీతాలు కార్లకంటే వేగం.. మూడు సెకండ్లలో వంద మీటర్ల పరుగు.. కానీ

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లాలో ఉన్న కునో నేషనల్ పార్క్ గ్వాలియర్ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పార్కులో శాకాహార జంతువులు ఎక్కువ. దీనికితోడు గడ్డి మైదానాలు ఉండటంతో చీతాలను వదలడానికి కునో నేషనల్ పార్క్‌ను ఎంచుకున్నారు. చీతాలను ప్రవేశపెట్టడానికి అనువైన స్థలం కోసం ఐదు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ అంతటా పది స్థలాలను 2010 నుంచి 2012 మధ్య సర్వే చేశారు. పలు రకాల సర్వేల అనంతరం కునో పార్కులో చీతాలను ఉంచేందుకు నిర్ణయించారు.

Cheetahs Releases: చీతాలను కునో నేషనల్ పార్కులోని ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేసిన ప్రధాని.. గ్యాలరీ

మధ్య‌ప్రదేశ్‌లోని విస్తారమైన అటవీ భూభాగంలో కునో నేషనల్ పార్క్ 748 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ జింకలు, దుప్పులు, మనుబోతులు, అడవి పందులు, చింకారాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ శాకాహర జంతువులు భారీగా ఉండటంతో చీతాలకు ఆహార సమస్య ఉండదు. ఇదిలాఉంటే ఈ పార్కులో చీతాలకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రతలు 42.3 డిగ్రీల సెల్సియస్. శీతాకాలంలో 6 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చీతాలకోసం ఐదు నుంచి పది చ.కి.మీ. పరిధిలో ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాలుగు నుంచి పది వారాల పాటు వీటిలోనే మొదట చీతాలను ఉంచుతారు. వాటిలో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తున్నాయా? లాంటివి మొదట్లోనే జాగ్రత్తగా గమనిస్తారు.

ట్రెండింగ్ వార్తలు