Cheetahs Back In India: చీతాలు కార్లకంటే వేగం.. మూడు సెకండ్లలో వంద మీటర్ల పరుగు.. కానీ

దేశంలోకి అడుగుపెట్టిన చీతాలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి మూడు సెకండ్లలోనే వంద మీటర్ల దూరం పరుగెత్తగలవు. చాలా కార్ల కంటే ఈ వేగం ఎక్కువ. కానీ, ఎక్కువసేపు ఇదే వేగంతో ప్రయాణించలేవు.

Cheetahs Back In India: చీతాలు కార్లకంటే వేగం.. మూడు సెకండ్లలో వంద మీటర్ల పరుగు.. కానీ

Cheetahs Back In India: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం చీతాలను దేశంలోకి విడుదల చేశారు. దశాబ్దాల తర్వాత దేశంలో ప్రజలు చీతాల్ని చూడబోతున్నారు. వీటికి చాలా ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా వీటి వేగం. ఈ చీతాలు అత్యధిక వేగంతో పరుగెత్తగలవు. మూడు సెకండ్లలో వంద మీటర్ల దూరం పరుగెడుతాయి.

Mumbai Attack: ముంబై దాడుల సూత్రధారిపై నిషేధానికి అడ్డుతగిలిన చైనా.. మరోసారి భారత ప్రయత్నాల్ని అడ్డుకున్న చైనా

ఇంత వేగంతో చాలా కార్లు ప్రయాణించలేవు. అయితే, ఇదే వేగాన్ని చీతాలు ఎక్కువ సేపు కొనసాగించలేవు. అర నిమిషంకంటే కొంచెం ఎక్కువ సేపు మాత్రమే ఈ వేగంతో ప్రయాణిస్తాయి. తర్వాత నెమ్మదిగా వేగం తగ్గిపోతుంది. ఎందుకంటే వీటికి శక్తి తక్కువ. ఇవి స్ప్రింటర్లలా కొంచెం దూరం మాత్రమే వేగంగా పరుగెత్తుతాయి. మారథాన్ రన్నర్లలా ఎక్కువ దూరం పరుగెత్తలేవు. నిమిషంలోపే అలసిపోతాయి. ఏదైనా జంతువును ఆహారం కోసం వేటాడినప్పుడు 30 సెకండ్లలోపే పట్టుకోవాలి. లేకుంటే అవి చిక్కవు. అందుకే వేటలో వీటి సక్సెస్ రేటు 40-50 శాతం మాత్రమే ఉంది. ఒకవేళ వేగంగా పరుగెత్తి ఏదైనా జంతువును వేటాడి పట్టుకున్నా, తర్వాత చీతాలు వాటిని కొద్ది సేపు వదిలేస్తాయి.

BiggBoss 6 Day 12 : రెండో వారం కెప్టెన్ ఎవరూ ఊహించని విధంగా.. హౌస్ లో సందడి చేసిన కృతిశెట్టి, సుధీర్ బాబు..

ఎందుకంటే ఆ లోపే చీతాలు అలసిపోతాయి. వేటాడినా వెంటనే వాటిని తినలేవు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నించడం వల్ల వీటి ఆహారాన్ని చిరుతలు, హైనాలు, అడవి కుక్కలు వంటివి ఎత్తుకుపోతాయి. మిగతా అటవీ మృగాల్లాగా ఇవి అంత శక్తివంతమైనవి కావు. ఇవి త్వరగా అలసిపోవడానికి కారణం వాటి శరీర నిర్మాణమే. వేగంగా పరుగెత్తినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. అయితే, అంత ఆక్సిజన్ స్వీకరించగలిగే పెద్ద ఊపిరితిత్తులు, రక్తాన్ని వేగంగా ప్రసరింప జేసే గుండె, బలంగా ఉండగలిగే వెన్నుపూస వంటివి లేకపోవడమే ఇందుకు కారణం.