Names:దేశవిదేశాల్లో ఎంతోమంది నియంతల పేర్లు ‘M’ అనే అక్షరంతో ఎందుకు మొదలవుతున్నాయి అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ. ఈమేరకు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్.. వైరల్ అవుతోంది. నియంతలను గురించి ప్రస్తావిస్తూ.. వాళ్ల పేర్లన్నీ ‘M’ అక్షరంతోనే ఎందుకు మొదలవుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు.
మార్కస్, ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో తదితరుల పేర్లను రాహుల్ ఉదహరణగా చూపించారు. ఈ ట్వీట్.. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వార్‌కు దారితీసింది. ప్రధాని మోడీ పేరు ‘M’తో మొదలవుతుండగా.. ఆయనను ఉద్ధేశించే ఈ విమర్శలకు సంబంధించిన వ్యాఖ్యలు చేసినట్లుగా బీజేపీ అభిమాన నెటిజన్లు అంటుంటే.. మోడీ నియంత అని ఒప్పుకున్నట్లా? అని కాంగ్రెస్ నెటిజనం ప్రశ్నిస్తోంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ హయంలో ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగడ్ పేరు కూడా ‘M’తోనే మొదలవుతుంది కదా? అంటూ రాహుల్‌ని ప్రశ్నిస్తున్నారు.