టిక్ టాక్ పిచ్చి పీక్ : పిల్లాడిని ఫ్రిజ్ లో పెట్టేశారు

టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. తేవటం ఏంటి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా జరిగాయి. మోస్ట్ పాపులర్ వీడియో షేరింగ్ యాప్ లలో టిక్ టాక్ ఒకటి.

  • Publish Date - April 17, 2019 / 11:03 AM IST

టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. తేవటం ఏంటి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా జరిగాయి. మోస్ట్ పాపులర్ వీడియో షేరింగ్ యాప్ లలో టిక్ టాక్ ఒకటి.

టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. తేవటం ఏంటి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా జరిగాయి. మోస్ట్ పాపులర్ వీడియో షేరింగ్ యాప్ లలో టిక్ టాక్ ఒకటి. 2016లో డౌయిన్ పేరుతో ఇది చైనాలో అయిన ఈ టిక్ టాక్ వీడియో షేరింగ్ తో విచక్షణ  మరచిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.   ఈపిచ్చితో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీంతో ఈ టిక్ టాక్ అరాచకం ఒక్కోసారి శ్రుతి మించిపోతోంది.
Also Read : ప్రియాంకా గాంధీ ‘దొంగ భార్య’ : ఉమాభారతి

 గన్‌తో టిక్ టాక్ వీడియో కోసం ప్రయత్నించి ఢిల్లీలో ఒకరు చనిపోయారు. గాయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తమ కుమారుడ్ని (చిన్న పిల్లాడు) ఫ్రిజ్‌లో పెట్టేశారు. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసేసరికి ఆ చిన్నారి బొమ్మలా బిగిసిపోయాడు. ఫ్రిజ్‌లో కూలింగ్ ఎక్కువగా ఉండటంతో..లోపల నుంచి పొగలు వస్తున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడతున్నారు. చిన్న పిల్లాడితో ఇదేం చేష్టలంటు తిట్టిపోస్తున్నారు. 

 ఆ పసివాడికి ఏదైనా అయితే ఏం చేస్తారు..వారసలు కన్నవారేనా అంటు దుమ్మెత్తిపోస్తున్నారు. సరదా పేరుతో చిన్నారుల ప్రాణాలతో చెలగాటమేంటంటు శాపనార్థాలు పెడుతున్నారు. టిక్ టాక్ యాప్ ద్వారా యూజర్లు స్పెషల్ ఎఫెక్ట్స్ తో వీడియోలు క్రియేట్ చేయవచ్చు, షార్ట్ వీడియోలు షేర్ చేస్తుంటారు. ఈ వీడియో షేరింగ్ యాప్ అయిన టిక్ టాక్ కు భారత్ లో ఆదరణ ఎక్కువవుతోంది. టిక్ టాక్ యాప్ ఫ్లాట్ ఫాంపై యూజర్లు ఎక్కువగా జోక్స్ క్లిప్స్, వీడియో సాంగ్స్ కు తగ్గట్లుగా లిప్ మూమెంట్, బాడీ మూమెంట్స్ ఇవ్వడం, డాన్స్ వేయడం వంటివి చేస్తుంటారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో పిచ్చి పిచ్చి వీడియోలతో ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు ఎక్కవవుతున్నారు. ఇటువంటిదే ఈ వీడియో కూడా. 
Also Read : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10వేల లోపు Best స్మార్ట్ ఫోన్లు ఇవే