Mitti Cafe
Mitti Cafe : సుప్రీంకోర్టు ఆవరణలో ఇటీవల ‘మిట్టి కేఫ్’ ప్రారంభమైంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్‌తో పాటు ఇతర న్యాయమూర్తులు ఈ కేఫ్‌ను ప్రారంభించారు. ఈ కేఫ్‌ను చంద్రచూడ్ భార్య కల్పనా దాస్ సందర్శించారు. అయితే ఈ మిట్టి కేఫ్ ప్రత్యేకత ఏంటి? అంటే..
Ambedkar Starue at SC: స్వాతంత్య్రం వచ్చిన 76 ఏళ్లకు.. సుప్రీంకోర్టు ఆవరణలో అంబేద్కర్ విగ్రహం
సుప్రీంకోర్టు ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘మిట్టి కేఫ్’ ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ భార్య కల్పనా దాస్ సందర్శించారు. అక్కడి సిబ్బందితో కాసేపు మాట్లాడారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన హన్స్‌రాజ్ కాలేజీలో కూడా మిట్టి కేఫ్ ప్రారంభించినట్లు ఆమె చెప్పారు. కేఫ్‌లోని వస్తువులను కొనుగోలు చేసిన కల్పనా దాస్ మరోసారి కేఫ్‌కు వస్తానని హామీ ఇచ్చారు.
మిట్టి కేఫ్‌ను దివ్యాంగులు నిర్వహిస్తున్నారు. ఎన్జీవో నిర్వహణలో వీరంతా పనిచేస్తున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే దీనిని ఏర్పాటు చేశారు. బెంగళూరు ఎయిర్ పోర్టు, పలు MLC కంపెనీలతో సహా ఇప్పటికీ ఈ కేఫ్‌లు భారతదేశ వ్యాప్తంగా 37 పనిచేస్తున్నాయి. NGP 2017 లో ఈ సర్వీస్ ప్రారంభించింది. ప్రత్యేక సామర్థ్యం ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీటిని ప్రారంభించారు.
ఈ కేఫ్ ప్రారంభ వేడుకలో చీఫ్ జస్టిస్ ప్రతి ఒక్కరూ ఈ కేఫ్‌ను సందర్శించి మద్దతు ఇవ్వాలని రిక్వెస్ట్ కూడా చేశారు.ఆనతి కాలంలోనే ఈ కేఫ్ సుప్రీంకోర్టు ఆవరణలో హిట్ అయ్యింది. ప్రస్తుతం మధ్యాహ్నం భోజనం చేయడానికి స్థలం లేని రోజులను మర్చిపోయేలా చేస్తోంది ఈ కేఫ్.