కరోనా భారత్‌లో మరింత ప్రమాదకరంగా మారనుందా..? 

కరోనా వైరస్ భారత్‌లో మరింత ప్రమాదకరంగా మారనుందా..? ఇప్పటికే ఆ సంకేతం వచ్చేసిందా.. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ మరణం.. ఇదే సందేహం కలిగిస్తోంది..

  • Publish Date - April 5, 2020 / 08:42 PM IST

కరోనా వైరస్ భారత్‌లో మరింత ప్రమాదకరంగా మారనుందా..? ఇప్పటికే ఆ సంకేతం వచ్చేసిందా.. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ మరణం.. ఇదే సందేహం కలిగిస్తోంది..

కరోనా వైరస్ భారత్‌లో మరింత ప్రమాదకరంగా మారనుందా..? ఇప్పటికే ఆ సంకేతం వచ్చేసిందా.. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ మరణం.. ఇదే సందేహం కలిగిస్తోంది.. భయాందోళనకి దారి తీస్తోంది. కరోనా రూపం మార్చేసుకుంటోందా? చాప కింద నీరులా పాకేస్తోందా? ఈసారి టెస్టులకు కూడా అందకుండా కమ్మేస్తుందా? ఇవే అనుమానాలు కలుగుతున్నాయిప్పుడు. మహారాష్ట్రలోని పూణేలోని ఓ కేసు చూస్తే.. అందరికీ టెన్షన్ కలగక తప్పదు. 

పూణేలో 60ఏళ్ల ఓ మహిళకు గత నెలలో కరోనా లక్షణాలు కన్పించడంతో ట్రీట్‌మెంట్ కోసం నాయుడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చేసిన పరీక్షలలో ఆమెకి కరోనా నెగటివ్ రిజల్ట్ వచ్చింది… ఐతే కొద్ది రోజులకే మళ్లీ అనారోగ్యం పాలవడంతో పూణేలోని సస్సూన్ హాస్పటల్‌కి తరలించారు..అప్పటికే ఆమె ప్రాణం పోయిందని డాక్టర్లు నిర్ధారించారు..ఐతే బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్‌కి పంపించారు. .మరణానంతరం చేసిన పరీక్షల్లో మాత్రం ఆమెకి కరోనా పాజిటివ్ నిర్దారణ వచ్చింది.. దీంతో అటు వైద్యసిబ్బందిలోనూ మహారాష్ట్ర ప్రభుత్వంలో తీవ్రమైన టెన్షన్ పెరిగిపోయింది 

మృతురాలికి మొదట నెగటివ్ వచ్చి పాజిటివ్ రావడానికి కారణమేంటి.. వైరస్ అప్పటికే రూపం మార్చేసుకుంటుందా..టెస్టులకు అందడం లేదా..అనేది పెద్ద డౌట్ అయితే..మొదటిసారి చేసిన పరీక్ష సరిగా నిర్వహించలేదా అనేది ఇంకో డౌట్..ఈ రెండు విషయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.. వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ .. దీన్ని నిగ్గు తేల్చడానికి ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మూడువేలు దాటిపోయిన నేపధ్యంలో మహారాష్ట్రలోనే దీని ప్రభావం ఎక్కువగా ఉంది.. కరోనాని కట్టడి చేయలేక మహారాష్ట్ర ఓ వైపు సతమతం అవుతుంటే..తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామం మరింత బెంబేలెత్తిస్తోంది.