దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ జరుగుతుంది. కొందరేమో దీనిని పొడిగిస్తారంటూ ప్రచారం కూడా మొదలెట్టేశారు. సాక్ష్యాత్తు ప్రధాని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ పెట్టి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం క్యాబినెట్ మీటింగ్ లో దానిపై తుది నిర్ణయం తీసుకుంటుందని భావించారంతా.
ఈ అంశంపై ఆతురతగా ఎదురుచూసిన జనాలకు మరోసారి నిరాశే ఎదురైంది. దేశవ్యాప్తంగా అభిప్రాయాలు సేకరించే లాక్ డౌన్ చేస్తామని.. అది కూడా సరైన టైంలోనే పూర్తి చేస్తారని ఉత్తరప్రదేశ్ లోని అధికారి మాట్లాడుతూ అన్నారు. దాంతో పాటే ప్రజలు కొంత ఓపిక పట్టాలని రోజురోజుకూ కొవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని సూచించారు.
మరో ఎనిమిది రోజులు ఉండగా కేంద్ర క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ‘మేం ప్రపంచంలో ఉన్న పరిస్థితులను ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్నాం. జాతి అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుంటాం. అది కూడా సరైన సమయంలోనే అమలు చేసేలా చూస్తామని’ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.
దీనిపై అధికారుల బృందం పని చేస్తుందని, పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 24న ఏప్రిల్ 14వరకూ 21రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. భారతదేశంలో ఇప్పటికీ 4వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా, 109మంది ప్రాణాలు కోల్పోయారు.