Will remove AFSPA only after installing peace says Amit Shah in Assam
AFSPA: అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో అస్ఫా (సాయుధ బలగాల ప్రత్యేక అధికార చట్టం-ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్) చట్టాన్ని పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే ఈ చట్టాన్ని పూర్తిగా తొలగించాలంటే ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా శాంతి నెలకొనాలని అప్పుడే సంపూర్ణ ఎత్తివేత సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా.. శనివారం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చామని, అయితే మరో ఐదేళ్లు తమకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని వరద రహితంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
‘‘2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అస్ఫాను తొలగిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే ఇది బుజ్జగింపు మాత్రమే. ఇప్పట్లో అస్ఫాను తొలగించడం అంత సులభం కాదు. కానీ మేము ఎవరినీ బుజ్జగింపు కోసం చెప్పడం లేదు. అస్ఫాను తొలగిస్తాం. కానీ ఎప్పుడంటే..? రాష్ట్రంలో తొందరలో పూర్తిగా శాంతిని నెలకొల్పుతాం. అప్పుడే అస్ఫా చట్టాన్ని పూర్తిగా ఎత్తివేయడం సాధ్యం అవుతుంది. అది మేము చేసి చూపిస్తాం’’ అని అన్నారు. ఇంకా ఆయన రాష్ట్రంలో వచ్చే వరదలపై స్పందిస్తూ ‘‘బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలో ఉగ్ర కార్యకలాపాలు ఎక్కువగా ఉండేవి. మేం అధికారంలోకి వస్తే ఉగ్రవాదాన్ని ఏరేస్తామని హామీ ఇచ్చాం. చేసి చూపించాం. మాకు మరో ఐదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రంలో వరదలు లేకుండా చేస్తాం’’ అని అన్నారు.
Rajasthan investment: రూ.60 వేల కోట్ల అదానీ డీల్‌ను సమర్ధించిన రాహుల్ గాంధీ