29నే ప్రమాణస్వీకారం..గవర్నర్ ని కలిసిన హేమంత్ సోరెన్

జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ జార్ఖండ్ గవర్నర్ ని కలిశారు. తమకు 50మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ని కోరినట్లు హేమంత్ సోరెన్ తెలిపారు. డిసెంబర్-29,2019న సీఎంగా తాను ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.

సోమవారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదలైన విషయం తెలిసిందే. జేఎంఎం పార్టీ 30స్థానాలు,కాంగ్రెస్ 16స్థానాలు,ఆర్జేడీ1 స్థానంలో విజయం సాధించింది. ఈ మూడు పార్టీలకు కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. 81స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 41కాగా జేఎంఎం కూటమికి మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ 25స్థానాల్లో విజయం సాధించి అధికారం కోల్పోయింది. సీఎం రఘుబర్ దాస్ సైతం స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. సోమవారం రఘుబర్ దాస్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.