Kumaraswamy On meeting with kcr: దసరాలోగా ఓ కీలక నిర్ణయాన్ని వెల్లడిస్తాం: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

హైదరాబాద్‌ లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి కలిసి, చర్చించడంతో వారు జాతీయ రాజకీయాలు, కొత్త పార్టీపై చర్చించారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై కుమారస్వామి స్పందించారు. కేసీఆర్‌తో తాను జరిపిన చర్చలు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కాదని స్పష్టం చేశారు. అయితే, వచ్చే దసరాలోగా ఓ కీలక నిర్ణయం వెల్లడిస్తామని అన్నారు. దేశంలోని రైతులు, మౌలిక సమస్యలను పరిష్కరించే దిశగా తమ మధ్య చర్చలు జరిగాయని అన్నారు.

Kumaraswamy On meeting with kcr: హైదరాబాద్‌ లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి కలిసి, చర్చించడంతో వారు జాతీయ రాజకీయాలు, కొత్త పార్టీపై చర్చించారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై కుమారస్వామి స్పందించారు. కేసీఆర్‌తో తాను జరిపిన చర్చలు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కాదని స్పష్టం చేశారు. అయితే, వచ్చే దసరాలోగా ఓ కీలక నిర్ణయం వెల్లడిస్తామని అన్నారు. దేశంలోని రైతులు, మౌలిక సమస్యలను పరిష్కరించే దిశగా తమ మధ్య చర్చలు జరిగాయని అన్నారు.

ఆయా అంశాలను ఎలా అమలు చేయాలో కేసీఆర్ కు మాత్రమే తెలుసని కుమారస్వామి చెప్పారు. దేశంలోని చిన్న పార్టీగా తామూ తెలంగాణ సీఎంకు సహకరిస్తామని అన్నారు. సమస్యలపై పరిష్కారం దిశగా ఎవరు గొంతు విప్పినా తాము సహకరిస్తామని చెప్పారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం అవసరమని తెలిపారు.

జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు నిర్దిష్టమైన లక్ష్యాలతో పని చేయాల్సి ఉందని కుమారస్వామి చెప్పారు. ఆయా అంశాలపైనే కేసీఆర్‌తో చర్చించానని తెలిపారు. కాగా, జాతీయ రాజకీయాలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ దేశంలోని పలువురు నేతలతో కలిసి చర్చించారు. ఢిల్లీలోనూ ఆయన పలువురు నేతలను కలిశారు.

COVID-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా రోజువారీ కేసులు… కొత్తగా 4,369 నమోదు

ట్రెండింగ్ వార్తలు