G20 Summit Delhi: ఇక నుంచి జీ20 కాదు, జీ21 అని పిలవాలి.. కారణం ఏంటో తెలుసా?

మనం కలిసి ప్రపంచ విశ్వాస లోటును విశ్వసనీయంగా మారుద్దామని అన్నారు. అందరూ కలిసికట్టుగా కదలాల్సిన సమయం ఇదని.. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రం మనందరికీ మార్గదర్శకం కాగలదని మోదీ పేర్కొన్నారు.

African Union: ఇక నుంచి జీ20ని జీ21గా పిలవాలి. కారణం, ఈ కూటమిలో ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వం తీసుకుంది. ఇదే సమయంలో భారతదేశం గ్లోబల్ సౌత్ నాయకత్వంలో స్థిరపడింది. ఆఫ్రికన్ యూనియన్‌లో మొత్తంగా 55 దేశాలు ఉన్నాయి. ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వానికి భారత్ మద్దతు ప్రకటించింది. జీ-20లో ఇప్పటి వరకు 19 దేశాలతో పాటు యురోపియన్ యూనియన్ ఉన్నాయి. అయితే తాజాగా ఆఫ్రికన్ యూనియన్ చేరుతోంది.

G20 Summit Delhi: భద్రతావలయంలో ఢిల్లీ.. G20 సమావేశాల సందర్భంగా రెండు రోజులు సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

19 దేశాల సరసన రెండు యూనియన్లు ఈ కూటమిలో భాగస్వామ్యంగా ఉంటాయి. అయితే ఈ ఏడాది సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో అతిథిగా ఆఫ్రికన్ యూనియన్ హాజరైంది. ఈ సందర్భంలోనే శాశ్వత సభ్యత్వం తీసుకుంది. ఇక ఈ చేరికపై ప్రధాని మోదీ స్పందిస్తూ ‘‘ఆఫ్రికన్ యూనియన్‌కు జి20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మేము ప్రతిపాదించాము. మీరందరూ దీనితో ఏకీభవిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీ అందరి సమ్మతితో తదుపరి చర్యను ప్రారంభించడానికి ముందు, నేను ఆఫ్రికన్ యూనియన్‌ను సభ్యునిగా ఆహ్వానిస్తున్నాను’’ అని అన్నారు.


ఇక జీ20 సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ కోవిడ్-19 తర్వాత, విశ్వాసం లేకపోవడం వల్ల ప్రపంచంలో పెద్ద సంక్షోభం వచ్చిందని అన్నారు. యుద్ధం విశ్వాస లోటును మరింతగా పెంచిందని.. మనం కోవిడ్‌ను ఓడించగలిగినప్పుడు, పరస్పర అపనమ్మకం రూపంలో వచ్చిన సంక్షోభాన్ని కూడా మనం ఓడించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. మనం కలిసి ప్రపంచ విశ్వాస లోటును విశ్వసనీయంగా మారుద్దామని అన్నారు. అందరూ కలిసికట్టుగా కదలాల్సిన సమయం ఇదని.. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రం మనందరికీ మార్గదర్శకం కాగలదని మోదీ పేర్కొన్నారు.