Omicron Third Wave : భారత్‍లో థర్డ్ వేవ్ ఖాయం..! అయినా భయపడాల్సిన అవసరం లేదట

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

Omicron Third Wave : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో భారత్ లో కరోనా థర్డ్ వేవ్ కు ఒమిక్రాన్ వేరియంట్ కారణమవ్వొచ్చని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో మన దేశంలో స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్‌ కనిపించనుందని, ఫిబ్రవరికల్లా పీక్ స్టేజ్ కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఐఐటీ కాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

Liver : లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ‘సూత్ర’ అనే విధానం ఆధారంగా ఆయన ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఒమిక్రాన్ కు భయపడాల్సిన అవసరం లేదని ప్రొ.అగర్వాల్ చెప్పారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అన్నారు. మనిషి శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధకశక్తిని ఒమిక్రాన్ తగ్గించబోదని స్పష్టం చేశారు.

”కరోనా థర్డ్ వేవ్ రావడం ఖాయం. ఒమిక్రాన్‌కు సంక్రమణ సామర్థ్యం ఎక్కువే. అయినప్పటికీ అది సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ సోకినా క్లిష్టమైన సమస్యలు తలెత్తవు. అందుకే కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి వెళ్లినప్పటికీ ఒమిక్రాన్ ప్రభావం, ఆస్పత్రుల్లో చేరికలు తక్కువగానే ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకునే చర్యలపైనే దీని ప్రభావం ఆధారపడి ఉంటుంది. జనాలు గుంపులుగా చేరకుండా నిషేధం విధించడం, రాత్రి పూట కర్ఫ్యూలు అమలు చేయడం వంటి చర్యలు సరిపోతాయి” అని ప్రొ.అగర్వాల్ చెప్పారు.

Body Ageing: ఇవి తింటున్నారా.. ముసలితనం ముందే రావడం ఖాయం

కొత్త రూపంలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరోసారి కలవరపెడుతోంది. వేగంగా విస్తరిస్తోన్న ఈ వేరియంట్‌ ప్రభావంతో రానున్న రోజుల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరగనుందని నిపుణులు తేల్చారు. భారత్ లో మహమ్మారి ప్రభావాన్ని గణితశాస్త్రపరంగా అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తున్న సూత్ర మోడల్‌ను ప్రొఫెసర్ అగర్వాల్‌ రూపొందించారు.

ట్రెండింగ్ వార్తలు