liver : లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు

రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే బీట్ రూట్ జ్యూస్‌ను తాగుతుంటే లివ‌ర్ ఆరోగ్యం క్ర‌మంగా మెరుగు ప‌డుతుంది. దెబ్బ తిన్న లివ‌ర్ తిరిగి రిపేర్ అవుతుంది.

liver : లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు

Liver Cleaning

liver : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌యవాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది. కొవ్వుల‌ను, పిండి ప‌దార్థాలు, ప్రోటీన్ల‌ను జీర్ణం చేసి శ‌రీరానికి శ‌క్తి ల‌భించేలా చేస్తుంది. ఈవిధంగా లివ‌ర్ ఎన్నో ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అయితే రోజూ మ‌నం చేసే ప‌నులు, తీసుకునే ఆహారాల వ‌ల్ల లివ‌ర్‌లో వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు పేరుకుపోతుంటాయి. ముఖ్యంగా వేపుళ్లు, జంక్ ఫుడ్‌ను ఎక్కువ‌గా తిన‌డం, మ‌ద్యం ఎక్కువ‌గా సేవించ‌డం, పొగ తాగ‌డం వంటి కార‌ణాల వల్ల లివ‌ర్‌పై భారం ప‌డుతుంది. అది ఎక్కువ‌గా ప‌ని చేయాల్సి వ‌స్తుంది. దీంతో లివ‌ర్ అనారోగ్యాల బారిన ప‌డుతుంది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు లివ‌ర్‌ను శుభ్రం చేసుకుంటే దానికి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

నిత్యం మ‌నం తినే అనేక రకాల ఆహార ప‌దార్థాల ద్వారా శ‌రీరంలో పేరుకుపోయే విష ప‌దార్థాలు, వ్య‌ర్థాల‌ను లివ‌ర్ బ‌య‌ట‌కు పంపుతుంది. ఈ క్ర‌మంలో లివ‌ర్ ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇవి మ‌న శ‌రీరానికి హాని క‌లిగించ‌డ‌మే కాక‌.. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా క‌ల‌గ‌జేస్తాయి. లివ‌ర్ క్రమేపి దెబ్బతింటుంది. ఈ ఫ్రీ ర్యాడిక‌ల్స్‌కు అడ్డుక‌ట్ట వేయాలంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండాలి. అవి లేక‌పోతే లివ‌ర్ ఎక్కువ‌గా డ్యామేజ్ అవుతుంది. అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎప్ప‌టికప్పుడు అవి తిరుగుతూ ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి. ఈ క్ర‌మంలో లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. లివ‌ర్ శుభ్రం కూడా అవుతుంది.

పుదీనా ; లివ‌ర్‌ను శుభ్రం చేయ‌డంలో పుదీనా ఆకులు అద్భుతంగా ప‌నిచేస్తాయి. పుదీనా ఆకుల‌ను 10 తీసుకుని బాగా క‌డ‌గాలి. త‌రువాత ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో ఆ పుదీనా ఆకుల‌ను వేసి బాగా మ‌రిగించాలి. 10 నిమిషాల పాటు స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి. త‌రువాత ఆ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. దీన్ని రాత్రి నిద్ర‌కు ముందు తాగాల్సి ఉంటుంది. గోరు వెచ్చ‌గా ఉండ‌గానే దీన్ని తాగేయాలి.

పై విధంగా పుదీనా ఆకుల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని నిద్ర‌కు ముందు తాగుతుంటే.. దాంతో లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు పోతాయి.  వారంలో మూడు సార్లు ఇలా చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

బీట్ రూట్ ; రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే బీట్ రూట్ జ్యూస్‌ను తాగుతుంటే లివ‌ర్ ఆరోగ్యం క్ర‌మంగా మెరుగు ప‌డుతుంది. దెబ్బ తిన్న లివ‌ర్ తిరిగి రిపేర్ అవుతుంది. లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్‌ను ఉద‌యం తాగ‌లేక‌పోతే మూడు పూట‌లా భోజ‌నానికి ముందు నాలుగైదు బీట్ రూట్ ముక్క‌ల‌ను తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీంతో లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు బీట్‌రూట్‌ను తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. ఆ వ్యాధి నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు. ఇక లివ‌ర్‌లో ఉన్న కొవ్వు క‌రిగేందుకు బీట్ రూట్ జ్యూస్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. లివ‌ర్‌ను ఆ జ్యూస్ క్లీన్ చేస్తుంది. క‌నుక బీట్‌రూట్ జ్యూస్‌ను రోజూ తాగ‌డం మంచిది.

ఒక బీట్ రూట్ ను చిన్న ముక్క‌లుగా కోసి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. అనంత‌రం వ‌చ్చే జ్యూస్‌లో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి తాగాలి. ఈ జ్యూస్‌ను ఒక క‌ప్పు మోతాదులో తాగ‌వ‌చ్చు. లేదా భోజనానికి ముందు మూడు పూట‌లా బీట్‌రూట్ ముక్క‌ల‌ను తినాలి. రోజూ ఇలా చేస్తే లివ‌ర్ క్లీన్ అవుతుంది. లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

చేపలు, కోడిగుడ్లు, నట్స్ ; వీటిలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి లివ‌ర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. లివ‌ర్‌లో పేరుకుపోయే కొవ్వును క‌రిగిస్తాయి. దీంతో లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది. లివ‌ర్ ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది. వారంలో కనీసం 2 సార్లు ఈ ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

ద్రాక్ష ; లివ‌ర్‌ను శుభ్రం చేయ‌డంలో ద్రాక్ష‌ అద్భుతంగా ప‌నిచేస్తుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. నిత్యం ఒక క‌ప్పు ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

ఆలివ్ ఆయిల్ ; ఆలివ్ ఆయిల్‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఆలివ్ ఆయిల్‌ను నిత్యం 1 టీస్పూన్ మోతాదులో తీసుకున్నా చాలు లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది. లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

వెల్లుల్లి, ఉల్లిపాయలు ; ఈ రెండు ఆహారాలు లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. వీటిల్లో ఫ్లేవ‌నాయిడ్లు అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. నిత్యం ప‌చ్చి వెల్లుల్లి రెబ్బలు 2,3 లేదా ప‌చ్చి ఉల్లిపాయ‌లు 50 గ్రాములు తిన‌డం వ‌ల్ల లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

అల్లం ; అల్లం వేయ‌డం వ‌ల్ల వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అంతేకాదు, అల్లం తింటే లివ‌ర్‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇందులో ఉండే జింజ‌రాల్స్‌, షోగోల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు లివ‌ర్ ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. లివర్‌లో పేరుకుపోయే కొవ్వును క‌రిగిస్తాయి. నిత్యం 4 గ్రాముల అల్లం తీసుకున్నా లేదా అల్లం ర‌సం తాగినా కొద్ది రోజుల్లోనే లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది. లివ‌ర్ సుర‌క్షితంగా ఉంటుంది.