Kangana
Kangana Ranaut: రాజకీయ నాయకులే కాకుండా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కంగనా రనౌత్ తన పద్మశ్రీని వెనక్కు ఇచ్చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం పద్మశ్రీ అందుకున్న కంగనా… ఆ వెంటనే జరిగిన మీడియా సమావేశంలో 1947లో ఇండియాకు దక్కింది భిక్ష మాత్రమేనని పోల్చడంపై యావత్ దేశమంతా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలా చెప్పడమే కాకుండా 2014తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాకే అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని కూడా చెప్పుకొచ్చింది.
దీని గురించి ఇప్పటికే బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ‘నీకేమైనా పిచ్చా అంటూ కామెంట్ చేయగా.,. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ షాకింగ్ గా ఉందంటూ ఆమె అవార్డును వెనక్కు తీసేసుకోవాలని కోరుతున్నారు.
Kangana Ranaut: కంగనా.. నీకేమైనా పిచ్చా – బీజేపీ ఎంపీ
‘స్వాతంత్ర్య సమరయోధుల సాహసాలను కించపరిచే విధంగా మాట్లాడిన కంగనా రనౌట్ స్టేట్మెంట్ లు దారుణంగా ఉన్నాయి. మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ లాంటి సాహసాలు, సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖఱ్ ఆజాద్ లాంటి వారి త్యాగ ఫలితం గురించి పలు ట్వీట్లలో వివరించారు. ఇటువంటి వ్యక్తులు అత్యున్నత పురస్కారాలు ఇచ్చి జాతిని, నిజమైన వీరులని అవమానించినట్లే అవుతుందని ఆయన అన్నారు.
– హర్యానా మాజీ సీఎం.. విచక్షణ లేని వ్యక్తి అని తిట్టిపోశారు.
– హిందూస్తానీ అవాం మోర్చా ప్రెసిడెంట్ జితన్ రామ్ మంఝీ ఆమెను వెలివేయాలని చెప్తున్నారు.
– శివసేన లీడర్ నీలం గోరె ఆమెను వెంటనే అరెస్టు చేయాలని.. పద్మ అవార్డును కూడా వెనక్కు తీసుకోవాలంటున్నారు.