Baba Ramdev: కామెంట్లు వెనక్కు తీసుకుంటున్నా.. విచారం వ్యక్తం చేస్తున్నా- రామ్‌దేవ్

యోగా గురు పతాంజలి ఎట్టకేలకు కామెంట్లు వెనక్కు తీసుకున్నారు. అల్లోపతి మెడిసిన్ పై చేసిన కాంట్రవర్షియల్ కామెంట్లు వివాదం తెచ్చిపెట్టడంతో రాజీకొచ్చారు.

Bab Ramdev

Baba Ramdev: యోగా గురు పతాంజలి ఎట్టకేలకు కామెంట్లు వెనక్కు తీసుకున్నారు. అల్లోపతి మెడిసిన్ పై చేసిన కాంట్రవర్షియల్ కామెంట్లు వివాదం తెచ్చిపెట్టడంతో రాజీకొచ్చారు. కేంద్ర మంత్రి డా.హర్ష్ వర్ధన్ లెటర్ ద్వారా కామెంట్లు వెనక్కు తీసుకోమని సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

దురదృష్టవశాత్తు.. వచ్చిన కామెంట్ ఇది. పబ్లిక్ ఫిగర్ గా ఉన్న మీ నుంచి వచ్చే ప్రతి స్టేట్మెంట్ ఉన్నత విలువలతో నిండి ఉండాలి. అని లెటర్ లో రాశారు.

దానికి రెస్పాన్స్ గా రామ్ దేవ్.. నాకు కేంద్ర మంత్రి నుంచి లెటర్ అందింది. దానిని గౌరవిస్తూ నా స్టేట్మెంట్ ను వెనక్కు తీసుకుంటున్నా. దాని వల్ల జరిగిన మొత్తం కాంట్రవర్సీకి సంతాపం తెలియజేస్తున్నా’ అని రామ్ దేవ్ అన్నారు.

శనివారం ఆయన చేసిన కామెంట్లకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లీగల్ నోటీస్ కూడా పంపింది. సైంటిఫిక్ మెడిసిన్ విలువలు తగ్గించేలా మాట్లాడారని అందులో పేర్కొంది.

అసలేం జరిగిందంటే..
రామ్ దేవ్ 140 సెకన్ల పాటు ఉన్న వీడియోలో మొబైల్ చూస్తూ.. ‘అల్లోపతి అనేది ఓ స్టుపిడ్ మెడిసిన్. ముందు క్లోరోక్విన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు రెమెడెసివర్. తర్వాత యాంటీ బయాటక్స్ ఫెయిల్ అయింది. స్టెరాయిడ్ ఫెయిల్ అయ్యాక ప్లాస్మా థెరఫీ కూడా బ్యాన్ చేశారు’ అని చదివినట్లుగా ఉంది.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను రామ్ దేవ్ పై యాక్షన్ తీసుకోవాలని సూచించింది.