Woman Beats Groom With Slipper : కొడుకుని పెళ్లిపీటల మీద చెప్పుతో కొట్టిన తల్లి

కన్న కొడుకు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటున్నాడని ఓతల్లి తన కొడుకును పెళ్లి పీటలమీదే చెప్పుతో కొట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో చర్చనీయాంశంగా మారింది.

Woman Beats Groom With Slipper : కొడుకుని పెళ్లిపీటల మీద చెప్పుతో కొట్టిన తల్లి

Woman Beats Groom With Slippers On Stage

Updated On : July 5, 2021 / 5:49 PM IST

Woman Beats Groom With Slipper : కన్న కొడుకు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటున్నాడని ఓతల్లి తన కొడుకును పెళ్లి పీటలమీదే చెప్పుతో కొట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో చర్చనీయాంశంగా మారింది.

హమీర్‌పూర్ జిల్లాలోని భరువాసుమేర్‌పూర్ లోని శివానీ ప్యాలెస్ లో ఉంటున్న ఉమేష్ చంద్ర అనే వ్యక్తి తన పొరుగింటిలో ఉండే అంకితా గౌతమ్ అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ వెళ్లి రిజిష్టర్ మ్యారేజి చేసుకుని వచ్చారు. కొడుకు కులాంతర వివాహాం చేసుకోవటం ఉమేష్ చంద్ర తల్లితండ్రులకు నచ్చలేదు.

కానీ అంకితా గౌతమ్ తండ్రి వీరి పెళ్లిని అంగీకరించాడు. తిరిగి తన కుమార్తెకు ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం హమీర్ పూర్ లోని ఒక గెస్ట్ హౌస్ లో ఏర్పాట్లు చేశాడు. పెళ్లికి తన వైపు బంధువులను అందరినీ పిలిచినప్పటికీ ఉమేష్‌చంద్ర తల్లితండ్రులను, కుటుంబసభ్యులను పిలవలేదు.

వివాహ కార్యక్రమం మొదలయ్యింది. వధూవరులిద్దరూ దండలు మార్చుకునే కార్యక్రమం జరుగుతుండగా వరుని తల్లి ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి వస్త్రం కప్పుకుని  ఫోటో గ్రాఫర్లను నెట్టుకుంటూ  వేదిక మీదకు వచ్చింది. వధూవరులు దండలు మార్చుకోగానే ఆమె తన చెప్పుతో కొడుకును కొట్టింది. ఇది గమనించిన వధువు బంధువులు ఆమెను వెంటనే స్టేజి మీదనుంచి కిందకు దించి పంపించి వేశారు.  కొడుకు కులాంతరవివాహం చేసుకున్నాడనే కారణంతోనే ఈ పని చేసినట్లు తెలుస్తోంది.