JNU నిరసన ర్యాలీలో DCP ప్రతాప్ సింగ్ వేలు కొరికేసిన మహిళ

  • Publish Date - January 10, 2020 / 05:38 AM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని JNUలో జరిగిన గురువారం (జనవరి 9) సాయంత్రం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళ సాక్షాత్తూ ఓ పోలీసు ఉన్నతాధికారి బొటనవేలు కొరికిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

గురువారం సాయంత్రం జేఎన్‌యూ విద్యార్థులు రాష్ట్రపతి భవన్ వైపు నిరసన ర్యాలీగా వెళ్లేందుకు యత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. యూనివర్శిటీ క్యాంపస్ నుంచి జనపథ్ వైపు రాకుండా పోలీసులు లౌడ్ స్పీకర్లతో అనౌన్స్ మెంట్ చేస్తూ విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ ఢిల్లీ అదనపు డీసీపీ ఇంగిత్ ప్రతాప్ సింగ్ వద్దకు వచ్చి అతని ఎడమ బొటనవేలిని కొరికి పారిపోయింది. దీంతో డీసీపీ చెయ్యిపై రక్తం కారింది. అంతగా వేలును కొరికేసింది సదరు మహిళ. ఇది గమనించిన పోలీసులు వెంటనే డీసీపీ ఇంగిత్ ప్రతాప్ సింగ్ ను హాస్పిటల్ వెళ్లి చికిత్స చేయించుకున్నారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన పోలీసులు  డీసీపీ బొటనవేలిని కొరికిన మహిళను గుర్తిస్తామని చెప్పారు. కాగా జేఎన్ యూలో ఆదివారం ముసుగు వ్యక్తులు చేసిన దౌర్జన్యకాండపై యావత్ దేశం తీవ్రంగా ఖండిచింది. ఈ క్రమంలో జేఎన్‌యూ వైస్ చాన్సలర్ జగదీష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని విద్యార్దులు డిమాండ్ చేశారు.

నిపై జేఎన్ యూ విద్యార్థి సంఘం, టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మానవవనరుల శాఖ అధికారులను కలిసి వినతిపత్రం అందించారు. జేఎన్‌యులో ఇటీవల జరిగిన హింసను నిరసిస్తూ, వర్సిటీ వైస్-ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది గురువారం ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు. 

ట్రెండింగ్ వార్తలు