బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ విధుల్లో మహిళా కానిస్టేబుల్, కారణం ఏంటీ ?

Woman Constable : ఎండలో, నడిరోడ్డుపై ఓ మహిళా కానిస్టేబుల్ బిడ్డను భుజాన ఎత్తుకుని విధులు నిర్వహిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పంజాబ్ రాష్ట్రంలోని చండీఘఢ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు ఆమె బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ విధులు ఎందుకు నిర్వహించింది ? అనే దానిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

విధుల పట్ల అంకిత భావాన్ని కొందరు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనపై నివేదిక తెప్పించుకోవడం జరిగిందని, సెక్టార్ 15/23 వద్ద ఉదయం 8 గంటలకు మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రియాంక విధుల్లో పాల్గొనాల్సి ఉండగా హాజరు కాలేదని SSP (traffic/security) Manisha Chaudhary వెల్లడించారు. అనంతరం బిడ్డతో కలిసి వచ్చిందన్నారు. senior traffic police Inspector Gurjeet Kaur ఘటనా స్థలికి చేరుకుని ఆరా తీశారు. ఈ వీడియోను ఉదయం 11 గంటలకు సెక్టార్ 15/23 రౌండ్ అబౌట్ సమీపంలో ఓ స్థానిక నివాసి వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.

ఇటీవలే తాను బిడ్డకు జన్మనివ్వడం జరిగిందని, కొడుకును చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ ఉండరని కానిస్టేబుల్ ప్రియాంక వెల్లడించారు. అత్త మామలు, భర్త Mahendragarh ఉంటారని, తాను నాలుగు రోజుల క్రితం డ్యూటీలో చేరడం జరిగిందన్నారు. తన అభ్యర్థన మేరకు ఇంటికి సమీపంలో డ్యూటీ కేటాయించారని, అనంతరం సెక్టార్ 15/23 రౌండ్ అబౌట్ కేటయించారన్నారు.

ఈ ప్రాంతం తన ఇంటికి దూరంగా ఉంటుందని, విధుల్లో పాల్గొనే సమయంలో ఆలస్యమైందన్నారు. తన బిడ్డను విస్మరించలేని పరిస్థితిలో ఉన్నట్లు, అందుకే తనతో పాటు బిడ్డను తీసుకరావడం జరిగిందన్నారు. తనకు అనుకూలమైన ప్రాంతంలో విధులు కేటాయించాలన్న తన అభ్యర్థనకు SSP (traffic) అంగీకరిచిందని ప్రియాంక వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు