Constable haldi In PS : స్టేషన్ లోనే మహిళా కానిస్టేబుల్ కు మంగళ స్నానాలు చేయించిన పోలీసులు
రాజస్థాన్ లోని డూంగర్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కు తోటి పోలీసులే పోలీస్ స్టేషన్ లోనే మంగళస్నానాలుచేయించారు. అనంతరం స్టేషన్ లో పనిచేసే పోలీసు సిబ్బంది అంతా నూతన వధువు కానిస్టేబుల్ ఆశను కుర్చీమీద కూర్చోబెట్టి స్టేషన్ ఆవరణలో ఊరేగించారు. పోలీస్ స్టేషన్ లోనే తోటి మహిళా కానిస్టేబుల్ కు మంగళస్నానాలు (హల్దీ వేడుక) చేయించటానికి కారణమేమంటే..ఆమెకు సెలవు దొరకకపోవటమే..

Women Constable Haldi In Poloce Station
women constable haldi In Poloce Station : వివాహం చేసుకోబోతున్న ఓ మహిళా కానిస్టేబుల్ కు పోలిస్ స్టేషనే పుట్టిల్లు అయ్యింది. తోటి మహిళా పోలీసులే కన్నవారు, తోడబుట్టినవారు..బంధువులు అయ్యారు. పోలీస్ స్టేషన్ లోనే ఆ మహిళా కానిస్టేబుల్ కు మంగళ స్నానాలు చేయించారు. పసుపు రాసి..వసంతపు నీళ్లతో మహిళా పోలీసులు మంగళస్నానాలు చేయించిన ఈ వింత ఘటన రాజస్థాన్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో జరిగింది. అలాగని వధువుకు ఎవరూ లేక కాదు. అయినవారంతా ఉన్నారు.
కానీ ఈ కరోనా కాలంలో ఇటువంటి వింతలు..విశేషాలకు కొదవలేదు..అని చెప్పటానికి ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు.. కన్నవారు..అయినవారు..ఆత్మీయుల మధ్య సరదాలు..ఛలోక్తుల మధ్య చేయాల్సిన చేయాల్సిన వివాహంలో ప్రధాన ఘట్టం అయిన మంగళస్నానాల్ని ఆమెకు మంగళ పోలీస్ స్టేషన్ లోనే ఎందుకు చేయాల్సి వచ్చిందీ అంటే..అంతా ఈ కరోనా కాలపు మహిమే కారణం. పోలీస్ స్టేషన్ లోనే మహిళా కానిస్టేబుల్ కు మంగళస్నానాలు విషయం చర్చనీయాంశంగా మారింది.
రాజస్థాన్‌లో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో డూంగర్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆశకు వివాహం నిశ్చయమైంది. ముహూర్తాలు పెట్టుకున్నారు. పెళ్లి పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. కానీ కొత్త పెళ్లికూతురుకి ‘సెలవు’దొరకలేదు. దీంతో పాపం వేరే దారిలేక కన్నవారి మధ్య జరగాల్సిన అపురూపమైన మంగళ స్నానాల ఘట్టాన్ని పోలీస్ స్టేషన్ లోనే తోటి మహిళా పోలీసులే చేయాల్సి వచ్చింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మినీలాక్ డౌన్‌లు అమలవుతున్న సందర్భంగా పోలీసులకు సెలవులు దొరకడం చాలా చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలో ఆశకు మంగళస్నానాలు (హల్ది వేడుక)చేయాల్సి ఉంది. కానీ సెలవు దొరకలేదు. దీంతో ఆమెకు తోటి మహిళా కానిస్టేబుళ్లు స్టేషన్ ఆవరణలోనే మంగళ స్నానం చేయించారు. ఆ తరువాత వధువును ఓ కుర్చీలో కూర్చోబెట్టి తోటి మగ పోలీసులు మా ఆశమ్మ పెళ్లికూతురాయెనే..అని ఆటపట్టిస్తూ స్టేషన్ ఆవరణలోనే సరదగా ఊరేగించారు.
ఈ సందర్భంగా ఆశ మాట్లాడుతూ తనకు గత ఏడాదే నా వివాహం జరగాల్సింది. కానీ అప్పుడు కూడా కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. కానీ ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు పోతుందో..తెలీదు. దీంతో మా పెద్దలు ఈ ఏడాదైనా వివాహం చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 30న వివాహం ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ నాకు ఈ సంవత్సరం కూడా లాక్‌డౌన్ కారణంగా వివాహానికి తగినన్ని సెలవులు దొరకలేదు.
దీంతో డ్యూటీలో ఉండే మంగళ స్నానం తంతు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది ఆశ. నా తోటి మహిళా పోలీసులే నాకు అమ్మలు..అక్కలు..ఆత్మీయుల్లా మారి నాకు మంగళస్నానాలు చేయించారని…కన్నవారి మధ్య జరగాల్సింది ఇలా జరుగుతున్నా..నాకు సంతోషంగానే ఉందని..ఇది అవకాశం నాతోటి మహిళా పోలీసులే చేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపింది నూతన వధువు ఆశ.