Woman Cop
Woman Cop : పోలీస్ అంటే తప్పు చేసిన వారిని శిక్షించాలి. క్రిమినల్స్ తాట తియ్యాలి. నేరస్తులను కటకటాల్లోకి పంపాలి. కానీ, ఆ పోలీస్ మాత్రం దారి తప్పింది. తప్పు చేసిన వారిని శిక్షించాల్సి పోయి స్వయంగా తప్పుల మీద తప్పులు చేసింది. ఏ పోలీసూ చేయకూడని పని చేసింది. చోరీ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు అమ్మి సొమ్ము చేసుకుంది ఆ మహిళా కానిస్టేబుల్. ఇలా.. గత ఆరేళ్లలో ఏకంగా రూ.26లక్షలు సంపాదించిందంటే ఆశ్చర్యం కలగకమానదు. చివరికి పాపం పండి దొరికిపోయింది.
Whats App Hacking : తల్లి వాట్సప్ హ్యాక్ చేసి, ఆమె ప్రియుడ్నిబ్లాక్ మెయిల్ చేసి…
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయ్ లో మహిళా కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు అమ్మి సొమ్ము చేసుకున్నట్టు తేలడంతో పోలీసులు ఆ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్నారు. ఓ స్క్రాప్ డీలర్ సాయంతో ఆ మహిళా కానిస్టేబుల్ చోరీ వాహనాలు అమ్మేసింది.
ఆమె పేరు మంగల్ గైక్వాడ్. వసాయ్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. చోరీ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలకు ఇంచార్జ్ గా ఉంది. అయితే ఆమె దారి తప్పింది. గత ఆరేళ్లలో చోరీ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు అమ్మి రూ.26లక్షలు సంపాదించింది. ఆడిట్ లో ఈ విషయం తెలిసింది.
Costly Cottage : నీరు లేదు, కరెంటూ లేదు.. అయినా ఈ కాటేజీ ధర రూ.5 కోట్లు, ఎందుకంత రేటు అంటే..
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో దుమారం రేగింది. పోలీసు ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. వెంటే ఆ మహిళా కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. అంతేకాదు అరెస్ట్ కూడా చేశారు.