PM Modi: ప్రధాని ఆదుకోవాలంటూ.. ఛాతిలో పేల్చుకుని మహిళ ఆత్మహత్య

ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ.. చాతిలో తుపాకీతో పేల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో విద్యాపురంలో ఉండే మోనా ద్వివేది(30) శుక్రవారం.. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ప్రధాని మోదీకి విన్నపమని పేర్కొని ఈ ఘటనకు పాల్పడింది.

Dead Body

PM Modi:ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ.. చాతిలో తుపాకీతో పేల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో విద్యాపురంలో ఉండే మోనా ద్వివేది(30) శుక్రవారం.. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ప్రధాని మోదీకి విన్నపమని పేర్కొని ఈ ఘటనకు పాల్పడింది.

శుక్రవారం ఉదయం గదిలోకి వెళ్లి తలుపేసుకున్న మహిళ 10గంటల సమయంలో దేశీవాలీ తుపాకీతో పేల్చుకుంది. బయటకు శబ్ధం వినిపంచిడంతో మోనా గదివైపు పరుగులు తీశారు. తలుపు బద్దలు కొట్టి గదిలోకి వెళ్లేసరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనకు పాల్పడకముందే మోనా.. సెల్ ఫోన్ లో మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి కుటుంబ సభ్యులకు పంపింది. అది సోషల్ మీడియా లాంటి మాద్యమాల ద్వారా పీఎం మోదీ వరకూ చేరాలని కోరింది. మహిళలకు వారి ఇళ్లలో భద్రత లేకుండాపోతుంది.అంటూ తన మరుదులు పంకజ్, అనూజ్ ల కారణంగానే చనిపోతున్నట్లుగా పేర్కొంది.

‘అధికార పార్టీకి చెందిన అంబుజ్, పంకజ్ లు.. తరచూ నన్ను శారీరకంగా హింసించేవారు. నేనొక పేదకుటుంబానికి చెందిన వ్యక్తిని. నా తండ్రి తాగుబోతు. ఈ విషయం వేరెవరికి చెప్పినా చంపేస్తామని బెదిరించారు. అని ఆమె రాసుకొచ్చారు.