ట్రైన్ ఎక్కుతూ కిందపడిపోయింది..ఆ తర్వాత

  • Publish Date - April 20, 2019 / 10:16 AM IST

మహారాష్ట్ర కోహ్లాపూర్ రైల్వే స్టేషన్. స్టేషన్‌ సందడి సందడిగా ఉంది. తమ ప్రాంతానికి వెళ్లాల్సిన రైలు ఎప్పుడొస్తుందా అని కొందరు వెయిట్ చేస్తున్నారు. కొందరు టికెట్లు తీసుకుంటున్నారు. వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కలకలం. కదులుతున్న రైలును ఎక్కడానికి ఓ మహిళ ప్రయత్నించింది. కానీ ఆమె ఎక్కలేకపోయింది. అప్పటికే రైలు వేగం అందుకుంది.

ఆమె రైలు ఎక్కలేక కిందపడిపోయింది. అందరూ ఇక ఆమెకు నూకలు చెల్లినట్లేనని భావించారు. వెంటనే ఒకతను ధైర్యం చేశాడు. ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. కిందపడిపోయిన ఆమెను పైకి లేపాడు. మరొక వ్యక్తి ఇతనికి సహకరించాడు. ట్రైన్ నుండి దూరంగా జరిపేశారు. ఆమె ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.