Viral Video: సెల్ఫీ తీసుకుంటూ కొండపై నుంచి పడిపోయిన మహిళ.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ కు చెందిన ఓ కుటుంబం హరిద్వార్ లోని మానసా దేవి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చింది.

video goes viral

Haridwar: సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు యువత ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రీల్స్, సెల్ఫీల పిచ్చితో యువత ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ మహిళ సెల్పీ తీసుకుంటూ కొండపై నుంచి పడిపోయింది. సుమారు 70 మీటర్ల లోయలో పడిపోవటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన హరిద్వార్ లో చోటు చేసుకుంది.

Also Read: Jani Master : ఇంటికి రాగానే పిల్లల్ని పట్టుకొని ఏడ్చిన జానీ మాస్టర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ కు చెందిన ఓ కుటుంబం శనివారం హరిద్వార్ లోని మానసా దేవి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చింది. ఆ ఫ్యామిలీకి చెందిన 28ఏళ్ల రేషు అనే మహిళ అక్కడే కొండపై సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవ శాత్తూ కాలుజారి సుమారు 70మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని మహిళను అంబులెన్సు ద్వారా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో స్థానిక పోలీసులు సంఘటన స్థలంకు చేరుకొని మహిళను అంబులెన్సు లో రిషికేశ్ లోని ఎయిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: JioHotstar Twist : ‘జియోహాట్‌స్టార్’ డ్రామాలో ట్విస్ట్.. ఈ డొమైన్ దుబాయ్ చిన్నారులకు అమ్మేసిన ఢిల్లీ టెక్కీ..!

కొండపై నుంచి పడిపోయి తీవ్రగాయాలతో ఉన్న మహిళను అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.