Woman Falls From Bed
Maharashtra : మహారాష్ట్రలోని థానే పట్టణంలో నివసిస్తున్న ఓ కుటుంబం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసింది. దానికి కారణం వారి ఇంట్లోనో లేదా ఆ ప్రాంతంలోనే అగ్రిప్రమాదం జరగటం వల్ల మాత్రం కాదు. వారి ఇంట్లో మంచం మీద నుంచి ఓ మహిళ కింద పడిపోయింది. దీంతో కంగారు పడి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫోన్ చేసి విషయం చెప్పారు. అది విన్న అగ్నిమాపక సిబ్బంది మొదట ఆశ్చర్యపోయారు. మంచం మీద నుంచి పడితే మేం వచ్చి ఏం చేయాలి..? దీనికి కూడా తమకు ఫోన్ చేస్తారా…? అని అనుకున్నారు. కానీ సదరు కుటుంబం అసలు విషయం చెప్పాక పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే వచ్చి సహాయక చర్యలు చేశారు.
మహారాష్ట్రలోని థానే పట్టణంలోని వాగ్‌బిల్ ప్రాంతంలోని ఓ కుటుంబం నివసిస్తోంది. వారి ఇంట్లో 62 ఏళ్ల మహిళ అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె ఎప్పుడు మంచంమీదనే ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆమె బరువు 160 కేజీలు. అధిక బరువుకు తోడు అనారోగ్యం. దీంతో ఆమె కదలేని పరిస్థితిలో ఉంది. శరీరం సహకరించదు. ఎవరైనా ఇద్దరు ముగ్గురు సహాయం చేస్తేనే కాస్త కదలగలుగుతుంది. దీంతో ఆమె ఎప్పుడు మంచానికే పరిమితమై ఉంటోంది. ఈక్రమంలో మంచంపై నిద్రిస్తున్న ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. దీంతో ఆమెను పైకి లేపి మంచంపై పడుకోబెట్టేందుకు కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. దీంతో వారు చేసేదేమీ లేక థానే అగ్నిమాపక సిబ్బంది సహాయం కోరారు.
Siddaramaiah : ఆలయంలోకి రావాలంటే నన్ను షర్టు విప్పమన్నారు: సీఎం సిద్దరామయ్య
మొదట్లో వారు చెప్పేది అగ్నిమాపక సిబ్బందికి అర్థం కాలేదు. సాధారణంగా అగ్నిప్రమాదం జరిగితేనే తమకు ఫోన్లు వస్తుంటుంది. కానీ కింద పడ్డ మహిళను మంచంపై పడుకోబెట్టటానికి సహాయం కోరటంతో వారు ఆశ్చర్యపోయారు. తరువాత విషయం అర్థం చేసుకున్న సిబ్బంది వెంటనే బాధితురాలి ఇంటికి వచ్చారు. ఆమెను జాగ్రత్తగా ఎత్తి మంచంపై పడుకోబెట్టారు.
ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందిలో ఉన్నతాధికారి మాట్లాడుతు..సాధారణంగా తమకు అగ్నిప్రమాదంలో వంటివి జరిగితా..ఎమర్జెన్సీ కాల్స్ వస్తుంటాయి. కానీ ఇలాంటి ఫోన్ రావటంతో ఆశ్చర్యపోయామని తెలిపారు.