ఒకే కాన్పులో నలుగురు జననం : తల్లీబిడ్డలు క్షేమం
కర్నాటకలో అరుదైన ఘటన జరిగింది. ఓ తల్లి ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది.

కర్నాటకలో అరుదైన ఘటన జరిగింది. ఓ తల్లి ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది.
కర్నాటకలో అరుదైన ఘటన జరిగింది. ఓ తల్లి ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది. శుక్రవారం రాత్రి విజయపురలో ముదునూరు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో దాలిబాయి అనే గర్భిణీ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు మగ పిల్లలు, మరో ఇద్దరు ఆడ పిల్లలు. తల్లి సహా నలుగురు బిడ్డలూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. బిడ్డల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు.