రాహుల్ ను ఎలా ముద్దుపెట్టేసుకుందో

  • Publish Date - February 14, 2019 / 10:51 AM IST

గుజరాత్ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓ మహళ లాగి మరీ ముద్దు పెట్టేసుకుంది. గతంలో కూడా కొందరు మహిళలు రాహుల్ ను ముద్దు పెట్టుకున్న ఘటనలు జరిగాయి. ఇప్పుడు తాజాగా గుజరాత్ లోని వల్సాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో ఈ సీన్ చోటు చేసుకుంది. వేదికపై కూర్చున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి పూలమాల వేసేందుకు కొందరు మహిళలు వచ్చారు. తన వద్దకు వస్తున్న వారిని చూసి రాహుల్ లేచి నిల్చున్నారు. ఇంతలో ఓ మహిళ రాహుల్ ను దగ్గరకు లాగి..ఆయన బుగ్గపై ముద్దు పెట్టింది. ఆ తర్వాత కూడా ఆయన గడ్డాన్ని పట్టుకుని ఆప్యాయతను కురిపించింది. ఈ సందర్భంగా, రాహుల్ కూడా నవ్వుతూ ఉండిపోయారు. 

గతంలో అసోమ్ పర్యటనలో రాహుల్ గాంధీని కొందరు మహిళలు ముద్దుపెట్టుకుని మరీ తమ ఆత్మీయతను వ్యక్తంచేశారు.  దీనికి సంబంధించిన వీడియోలు మీడియాలో తెగ ప్రచారం జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆఫీస్ కు వచ్చి రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానంటు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.