Chilli Powder: నిందితుడ్ని అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసుల కళ్లలో కారం కొట్టిందా తల్లి. కొడుకును కాపాడుకోవాలనే తాపత్రయంతో ముంబైలోని మాల్వాని ఏరియాలో ఈ ఘటన జరిగింది.
నిందితుడ్ని అరెస్టు చేసేందుకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అంబుజ్వాడీ ఏరియాకు వచ్చారు. పోలీసుల వల నుంచి తప్పించేందుకు కొడుకు దగ్గరకు రాగానే వాళ్ల కళ్లలో కారం కొట్టిందని న్యూస్ ఏజెన్సీకి చెప్పారు పోలీసులు.
కాసేపటి తర్వాత నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆ మహిళను కూడా అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 353, 332, 504, 506, 509 ప్రకారం.. కేసు నమోదు చేశారు.