Amritsar Police : లూడో లవ్ స్టోరీ…యువకుడి కోసం భర్త, బిడ్డలను వదిలేసి…

ఆన్ లైన్ లూడో ద్వారా పరిచయమైన యువకుడి కోసం భర్త, బిడ్డలను వదిలేయాలని నిర్ణయించుకుంది ఓ వివాహిత. ఆ యువకుడి కోసం ఏకంగా...

Wagha

Woman Tries To Cross Over : ఆన్ లైన్ లూడో ద్వారా పరిచయమైన యువకుడి కోసం భర్త, బిడ్డలను వదిలేయాలని నిర్ణయించుకుంది ఓ వివాహిత. ఆ యువకుడి కోసం ఏకంగా దేశ సరిహద్దులను దాటాలని ప్రయత్నించింది. చివరిక్షణంలో పోలీసుల ఎంట్రీతో ఆమె ప్రయత్నానికి చెక్ పడింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. రాజస్థాన్ కు చెందిన ఓ వివాహిత పంజాబ్ రాష్ట్రంలో కుటుంబంతో నివాసం ఉంటోంది. ఈమెకు రెండున్నరేళ్ల కుమారుడున్నాడు.

Read More : CM Jagan : మూడు రోజుల్లోనే పీఆర్సీ ప్రకటన..!

ఈమెకు ఆన్ లైన్ లో లూడో ఆడడం అలవాటు. అలా…పాక్ దేశానికి చెందిన ఓ యువకుడితో పరిచయం అయ్యింది. తరచూ వీరు ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసుకునే వారు. కలుసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అమృత్ సర్ లోని అత్తారి – వాఘా సరిహద్దుకు రావాలని చెప్పాడు. దీంతో అక్కడకు వెళ్లేందుకు ఆటో మాట్లాడుకుంది. ఆమెను ఫలానా చోటుకు తీసుకరావాలని ఆటో డ్రైవర్ కు చెప్పాడు.

Read More : Election Commission : అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పెంచిన ఎన్నికల సంఘం

ఆటో డ్రైవర్ కు అనుమానం వచ్చింది. నేరుగా పోలీలకు విషయం తెలియచేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను దేశ సరిహద్దులు దాటకుండా అడ్డుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు…మహిళ వద్ద కొంత డబ్బు, నగలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రాజస్థాన్ లో ఉన్న ఆమె తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు.