CM Jagan : మూడు రోజుల్లోనే పీఆర్సీ ప్రకటన..!
క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Jagan (1)
employees union representatives : ఏపీలో పీఆర్సీ సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ఈ మూడు రోజుల్లోనే పీఆర్సీని ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది. ఇందుకోసం చర్యలు చేపట్టింది. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన సీఎం జగన్.. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగులంతా ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు.
క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అన్ని అంశాలను నోట్ చేసుకున్నట్లు చెప్పిన సీఎం.. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. తెలంగాణలో ఇస్తున్న జీతాలతో పోల్చుకోలేమన్నారు సీఎం జగన్. అక్కడ తలసరి ఆదాయం ఎక్కువ అన్నారు. అలాగే తెలంగాణ జీతాలు, పెన్షన్లపై 22 వేల 608 కోట్లు ఖర్చు చేస్తే.. ఏపీ 36 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.
Election Commission : అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పెంచిన ఎన్నికల సంఘం
ఉద్యోగులకు మ్యాగ్జిమం చేయగలిగినంత మంచి చేస్తానని సీఎం జగన్ అన్నారు. మరోవైపు 14.29 శాతం ఫిట్‌మెంట్ సమ్మతం కాదని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. 50శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సీఎంను కోరామని.. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గాలేదని సీఎం చెప్పారన్నారు. మెరుగైన పీఆర్సీ ప్రకటిస్తే… ప్రభుత్వానికి మరింత ఎక్కువగా పనిచేస్తామని ఉద్యోగ సంఘం నేతలు అన్నారు.