Leopard
Mom fights Leopard: నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడమే కాదు శరీరంలో సత్తువ ఉన్నంతవరకూ ఆ బిడ్డ క్షేమం కోసం తపిస్తూనే ఉంటుంది తల్లి. ఆపద వస్తే ప్రాణాలకు తెగించి అయినా కాపాడుకోవాలనుకుంటుంది. ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లాలోనూ చిరుత బారిన పడ్డ తన ఆరేళ్ల కూతుర్ని కాపాడుకోవడానికి ఆ తల్లి అదే పనిచేసింది.
ఇంటి ఆవరణలో ఉన్న కోర్టు యార్డులో ఆడుకుంటున్న బాలికను చిరుత ఎత్తుకెళ్లిపోయింది. కూతురి కేక విన్న ఆ తల్లి బలమైన కర్రతో చిరుతపై దాడి చేసి కదలకుండా ఉండేందుకు చూసింది.
చిరుత భయపడిందో పట్టు కోల్పోయిందో గానీ చిన్నారిని అక్కడే వదిలేసి పారిపోయింది. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత దాడిలో చిన్నారి మాత్రం తీవ్ర గాయాలకు గురైంది.
Read Also: హాట్ బ్యూటీ ‘రత్తాలు’ అందాల వల!
వైల్డ్ లైఫ్ రేంజర్ రషీద్ జమీల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స చేసి బాలికను జిల్లా ఆసుపత్రికి పంపించారు. బిడ్డను కాపాడుకున్నా తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చేరి విషమ పరిస్థితికి చేరుకున్న చిన్నారిని చూసి తల్లి తల్లడిల్లిపోతుంది. బాలిక మొఖం, తలకు బాగా గాయాలు అయినట్లు వైద్యులు వెల్లడించారు.
బాలిక పేరు కాజల్ కాగా తల్లి పేరు రీనాదేవీ. చిరుతదాడి జరిగిన సమయంలో తల్లి గదులు ఊడుస్తుంది. క్షణాల్లో అప్రమత్తమవడంతో చిరుతను అడ్డుకోగలిగింది.