World Bank-India MSME : భారత్‌కు వరల్డ్ బ్యాంకు భారీ ఆర్థిక సాయం

కరోనా సంక్షోభ సమయంలో భారత్‌కు ప్రపంచ బ్యాంకు అండగా నిలిచింది. భారత్‌లోని MSME రంగానికి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.3,640 కోట్ల ఆర్థికసాయం చేసేందుకు ఆమోదం తెలిపింది.

World Bank to India MSME : కరోనా సంక్షోభ సమయంలో భారత్‌కు ప్రపంచ బ్యాంకు అండగా నిలిచింది. భారత్‌లోని MSME రంగానికి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.3,640 కోట్ల ఆర్థికసాయం చేసేందుకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న భారతీయ MSME రంగాన్ని పటిష్టం చేసేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయాలని సూచించింది. భారత్ కు నిధులు విడుదల చేయాలన్న ప్రతిపాదనకు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు అనుమతించింది.

2020 ఆరంభంలో భారత్‌లో కరోనా మహమ్మారి ప్రభావంతో అనేక రంగాలు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజల ఆరోగ్యం, MSME (చిన్న, మధ్య తరహా వ్యాపారాలు) రంగాన్ని కూడా దెబ్బతీసింది. దాంతో దేశంలోని 5.55 లక్షల వ్యాపార సంస్థలు భారత ప్రభుత్వ సాయాన్ని ఆర్థిస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో MSME రంగాల పునరుద్ధరణకు ప్రపంచబ్యాంకు నిధులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నాయి.

ఎంఎస్ఎంఈ రంగానికి భారతీయ ఆర్థిక వ్యవస్థ వెన్నుముక లాంటిది.. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం నుంచే 30 శాతం జీడీపీ, 40శాతం దిగుమతులపైనే నడుస్తోంది. ప్రపంచ బ్యాంకు అందించే ఈ (RAMP) ప్రొగ్రామ్ కింద 500 మిలియన్ డాలర్లు, MSME ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రొగ్రామ్ కింద 750 మిలియన్ డాలర్లను జూలై 2020లోనే అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రొగ్రామ్ కింద ఇప్పటివరకూ 5 మిలియన్ల ప్రభుత్వ సంస్థలు ఆర్థికంగా లబ్ధిపొందాయి.

ట్రెండింగ్ వార్తలు