Amit Shah at Kerala: ప్రపంచ దేశాలు కమ్యూనిజం నుంచి విముక్తి పొందుతున్నాయి

‘‘దేశంలో కాంగ్రెస్ అంతమవుతోంది. ప్రపంచ దేశాలు కమ్యూనిజం నుంచి విముక్తి పొందుతున్నాయి. కమ్యూనిజం ఈ దేశంలో దాదాపుగా అంతమైంది. ఒక్క కేరళలో కూడా అంతమైతే దేశం కమ్యూనిస్ట్ విముక్తంగా మారుతుంది. ఈ రెండు పార్టీలు గిరిజన, ఆదివాసీల కోసం ఏమీ చేయలేదు. వారిని కేవలం ఓట్ బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు. కేరళ భవిష్యత్ నాకు కనిపిస్తోంది. తొందరలోనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది’’ అని అమిత్ షా అన్నారు.

Amit shah slams nitish kumar

Amit Shah at Kerala: ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా కమ్యూనిజం నుంచి విముక్తి పొందుతున్నాయని, ఇండియా కూడా తొందరలోనే పూర్తి స్థాయిలో కమ్యూనిస్ట్ విముక్త దేశంగా అవతరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న ఆయన శనివారం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలపై విరుచుకుపడ్డారు.

‘‘దేశంలో కాంగ్రెస్ అంతమవుతోంది. ప్రపంచ దేశాలు కమ్యూనిజం నుంచి విముక్తి పొందుతున్నాయి. కమ్యూనిజం ఈ దేశంలో దాదాపుగా అంతమైంది. ఒక్క కేరళలో కూడా అంతమైతే దేశం కమ్యూనిస్ట్ విముక్తంగా మారుతుంది. ఈ రెండు పార్టీలు గిరిజన, ఆదివాసీల కోసం ఏమీ చేయలేదు. వారిని కేవలం ఓట్ బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు. కేరళ భవిష్యత్ నాకు కనిపిస్తోంది. తొందరలోనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది’’ అని అమిత్ షా అన్నారు.

దక్షిణభారత రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతాల 30వ సౌతెర్న్ జోనల్ కౌన్సిల్ మీట్‭ను కేరళలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు, లెఫ్ట్‭నెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో నీటి సమస్య పరిష్కారానికి మార్గాలు వెతకాలని సూచించారు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చర్చలతో పరస్పర సహకారంతో సమస్య పరిష్కారం చేసుకున్న విధానాన్ని ఆయన గుర్తు చేశారు.

Artemis 1: మూన్ మిషన్ ప్రయోగానికి రెండోసారి ఆటంకం.. ప్రయోగానికి ముందు ఇంధనం లీక్