Tungnath Shiva Temple
World Highest Shiva Temple : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన తుంగనాథ్ శివాలయం వంగిపోతోంది. తుంగనాథ్ శివాలయం ఐదారు డిగ్రీలు వంగుతున్నట్లు భారత పురావస్తు శాఖ పేర్కొంది. గర్వాల్ హిమాలయాల్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో 12,800 అడుగుల ఎత్తులో ఉన్న తుంగనాథ్ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయంగా గుర్తింపు పొందింది.
ఇప్పుడు ఈ ఆలయం ఐదారు డిగ్రీలు వంగిపోతున్నట్లు పురావస్తు శాఖ పరిశీలనలో తేలింది. అదే సముదాయంలో ఉన్న మిగతా కట్టడాలు 10 డిగ్రీల వరకు వంగిపోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆలయాన్ని రక్షిత కట్టడాల జాబితాలో చేర్చాలని కోరినట్లు ఏఎస్ఐ అధికారి పేర్కొన్నారు.
famous Temples : ఆ దేవాలయాలను దర్శంచుకోవటం అంత సులభం కాదు..
ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా, 8వ శతాబ్దంలో తుంగనాథ్ ఆలయాన్ని కత్కూరీ పాలకులు నిర్మించారు.