Wrestlers Protest: అర్ధరాత్రి అమిత్ షాతో రెజ్లర్ల భేటీ.. ఆ విషయంపై రెజ్లర్లకు క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

రెజ్లర్ల ఆందోళన రోజురోజుకు ఉదృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన నివాసంలో రెజ్లర్లతో భేటీ అయ్యారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగినట్లు తెలిసింది.

Wrestlers Meeting With Amit Shah: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్‌‌ (WFI Chief Brij Bhushan Saran Singh) కు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళన కొనసాగుతూనే ఉంది. బ్రిజ్ భూషణ్ పై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్దికాలంగా రెజ్లర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరి ఆందోళన రోజురోజుకు ఉదృతమవుతోంది. ఈ క్రమంలో గతనెల28న రెజ్లర్లు తమ పతకాలను హరిద్వార్ వద్ద గంగా నదిలో వదిలేందుకు సైతం సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో రైతు నేతల విజ్ఞప్తితో రెజ్లర్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

Wrestlers Protest: ప్రభుత్వం ఎవరినీ రక్షించడం లేదు.. రెజ్లర్ల సమస్యపై క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు

రెజ్లర్ల ఆందోళన రోజురోజుకు ఉదృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)  ఆయన నివాసంలో రెజ్లర్లతో భేటీ అయ్యారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగినట్లు తెలిసింది. ఈ భేటీలో రెజ్లర్లు బజ్‌రంగ్ పునియా (Bajrang Punia), సాక్షి మాలిక్  (Sakshee Malikkh), సంగీతా ఫొగాట్ (Sangita Phogat) పాల్గొన్నారు. జూన్ 9 వరకు ఖాప్ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వానికి ఆల్టిమేటం ఇచ్చిన తరుణంలో అమిత్ షా రెజ్లర్లతో సమావేశమయినట్లు తెలిసింది. అయితే, ఈ సమావేశంలో ఎలాంటి వివక్ష లేకుండా దర్యాప్తు చేస్తామని అమిత్ షా రెజ్లర్లకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు

రెండు గంటలపాటు జరిగిన భేటీలో రెజ్లర్లు అమిత్ షా వద్ద పలు విషయాలను ప్రస్తావించారు. బ్రిజ్ భూషణ్ పై వచ్చిన ఆరోపణలపై పారదర్శక దర్యాప్తు జరిపించాలని, వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టం అందరికీ సమానమే. చట్టాన్ని తనపని తాను చేయనివ్వండి అంటూ రెజ్లర్లకు అమిత్ షా సూచించినట్లు సమాచారం. అంతేకాక, ఉత్సాహంగా కాకుండా తెలివిగా వ్యవహరించాలని అమిత్ షా వారికి సూచించినట్లు తెలిసింది. అయితే, అమిత్ షాతో భేటీ విషయాన్ని బజరంగ్ పునియా మీడియా వద్ద ధృవీకరించారు. భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన విషయాలపై నేనేమీ మాట్లాడలేనని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు