ఐఐటీ జేఈఈ, యూపీఎస్సీ వంటి పరీక్షల్లో విజయం సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పురీక్షలు రాస్తుంటారు. సరైన ప్రణాళిక, నిబద్ధత లేకపోతే ఎన్నిసార్లు పరీక్షలు రాసినా ప్రయోజనం ఉండదు.
కొందరు ఐఐటీ జేఈఈ, యూపీఎస్సీ పరీక్షలు రాయాలని భావిస్తుంటారు. కానీ, అందుకు తగ్గట్లు చదవరు. కొందరు విద్యార్థులు మాత్రం లక్ష్యాన్ని మిస్ కాకుండా పక్కా ప్రణాళికతో చదువుతుంటారు. ఓ విద్యార్థి ఐఐటీ జేఈఈ కోసం వేసుకున్న ప్రణాళికకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
టైమ్ మేనేజ్‌మెంట్ విషయంలో అతడు ఎంతటి నిబద్ధతతో ఉన్నాడో ఇది తెలుపుతోంది. మిస్టర్ ఆర్సీ (16) పేరిట ఉన్న ట్విట్టర్ ప్రొఫైల్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. తన స్నేహితుడు (17) ఈ టైమ్ టేబుల్ వేసుకున్నాడని, జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడని అందులో తెలిపాడు. అందులో పడుకోవడానికి కేవలం 4.30 గంటలు మాత్రమే కేటాయించాడు ఆ విద్యార్థి.
మిగతా అధిక సమయం అంతా చదువుకే కేటాయించాడు. ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో క్లాస్ వర్క్ చేయాలి? వంటి అన్ని అంశాలపై కచ్చితమైన టైమ్ టేబుల్ రాసుకున్నాడు. నిద్రకు కేవలం నాలుగున్నర గంటలే కేటాయించడం, ప్రతి పనికి టైమ్ టేబుల్ వేసుకోవడంపై నెటిజన్లు ‘ఇంత కఠినంగా ఉండాలా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కి ఎదురుదెబ్బ.. అరెస్టు తప్పదా?