Delhi Liquor Case: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కి ఎదురుదెబ్బ.. అరెస్టు తప్పదా?

అరవింద్ కేజ్రీవాల్‌కు అరెస్ట్ నుంచి ఉపశమనానికి మధ్యంతర రక్షణను ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు..

Delhi Liquor Case: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కి ఎదురుదెబ్బ.. అరెస్టు తప్పదా?

Why Arvind Kejriwal skips ED summons

Updated On : March 21, 2024 / 5:01 PM IST

ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలివ్వాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తామా? లేదా? అన్న విషయాలు ఇప్పుడు తాము చెప్పలేమని కోర్టుకు ఈడీ తెలిపింది.

కేజ్రీవాల్ విచారణకు సహకరించాలని ఈడీ అధికారులు అన్నారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఏప్రిల్ 22 లోపు సమాధానం ఇవ్వాలని ఈడీకి హైకోర్టు సూచించింది. అరవింద్ కేజ్రీవాల్‌కు అరెస్ట్ నుంచి ఉపశమనానికి మధ్యంతర రక్షణను ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

తదుపరి విచారణ ఏప్రిల్ 22కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు చెప్పింది. ఈడీ సమన్ల వెనుక గల కారణాలను కేజ్రీవాల్ కి చెప్పకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఉన్న ఆధారాలను తమకు చూపించాలని ఢిల్లీ హైకోర్టు చెప్పింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొదటి నుంచి ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఈ కేసు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్ కు ఈ కేసులో పలుసార్లు నోటీసులకు స్పందించలేదు.

Also Read: రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రత